కాపుల సమావేశానికి వెళ్తే చంద్రబాబు నిలదీశారు

Avanthi Srinivas Speak Swearing In Ceremony of Kapu Chairman - Sakshi

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

సాక్షి, విజయవాడ: కాపులకు గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉందని  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) అన్నారు. కాపు ఛైర్మన్‌ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..చిన్న వయస్సున్న  రాజాకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కేటాయించడం పట్ల  వైయస్‌ జగన్‌ కాపుల పక్షపాతి అనడానికి నిదర్శనం అని పేర్కొన్నారు. గతంలో తాను కాపుల సమావేశానికి వెళ్ళితే చంద్రబాబు నిలదీశారని తెలిపారు. జన్మించేటప్పుడు..మరణించేటప్పుడు  మనకు తోడుగా  ఉండేది కులమేనని తెలిపారు. కాపులకు ఐక్యత ఉండదంటారని అదే మనకు బలం కావాలన్నారు. కాపులు ఆశించే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా జక్కంపూడి  రాజా కృషి చేయాలని కోరారు. బీసీలకు కాపు జాతి అన్యాయం చేయద్దని..కాపులు ఎవరికైనా కాపు కాస్తారే తప్ప అన్యాయం చేయరని తెలిపారు. 

కాపుల ఎదుగుదలను చంద్రబాబు అడ్డుకున్నారు:దాడిశెట్టి రాజా
70 శాతం ఉన్న కాపులను ఏ రంగంలో కూడా ఎదగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. సీఎం వైఎస్‌  జగన్‌మోహన్‌రెడ్డి కాపులకు అండగా ఉన్నారన్నారు. కాపు సంక్షేమానికి ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు.
సీఎం జగన్‌ కాపుల పక్షపాతి:సామినేని ఉదయభాను
కాపుల పక్షపాతి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని  ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను అన్నారు. కాపుల  సంక్షేమాన్ని చంద్రబాబు విస్మరించారన్నారు.కాపు ప్రజా ప్రతినిధులకు పెద్దపీట వేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అని కొనియడారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top