ఆటో బోల్తా: 14మందికి గాయాలు | Auto roll: 14 injured | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 14మందికి గాయాలు

Sep 17 2014 2:09 AM | Updated on Sep 2 2017 1:28 PM

ఆటో బోల్తా: 14మందికి గాయాలు

ఆటో బోల్తా: 14మందికి గాయాలు

మండలంలోని గుర్ల పెద్దకానాల వద్ద మంగళవారం ఉదయం ఆటో బోల్తాపడడంతో 14మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని గూడేం,

గుర్ల: మండలంలోని గుర్ల పెద్దకానాల వద్ద మంగళవారం ఉదయం ఆటో బోల్తాపడడంతో 14మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని గూడేం, గుజ్జంగివలస గ్రామాలకు చెందిన విద్యార్థులు నెల్లిమర్లలో ఉన్న ఆదిత్య పబ్లిక్ స్కూలుకు ప్రతి రోజూ వెళ్తుంటారు. అదే క్రమంలో మంగళవారం కూడా ఆటోలో వెళ్తుండగా  ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో 13 మంది విద్యార్థులు, డ్రైవరు గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిలో సిరిడి భవాని, కె. వాసవి, బి. లోకేష్, ఎమ్. తేజ, ఎమ్, కుమారి, బి. దుర్గాప్రసాధ్,ఎస్. భవాని, సోము అఖిల్, ఎమ్. వరుణ్ సందేష్, కె. రాంబాబు, టి.మంగ, టి. అభిషేక్ తదితరులున్నారని గుర్ల ఎస్సై నీలకంఠం తెలిపారు. క్షతగాత్రులకు నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. గుజ్జంగివలస గ్రామానికి చెందిన సిరిడి భవాని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.  అక్కడ చికిత్స అనంతరం మళ్లీ మిమ్స్‌కు తీసుకువచ్చారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement