కథ కొత్తగా అనిపించింది: వరుణ్‌ సందేశ్‌ | Caste Movie Glimpse Launch Event | Sakshi
Sakshi News home page

కథ కొత్తగా అనిపించింది: వరుణ్‌ సందేశ్‌

Apr 17 2026 12:30 AM | Updated on Apr 17 2026 12:30 AM

Caste Movie Glimpse Launch Event

వరుణ్‌ సందేశ్, ‘సత్యం’ రాజేశ్, గగన్, రవి

‘‘కాస్ట్‌’ చిత్రకథ విన్నప్పుడు చాలా కొత్తగా, వైవిధ్యంగా అనిపించింది. ఇందులో  బలమైనపాత్ర చేశాను. చాలా మంచిపాయింట్‌తో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అవుతుంది’’ అని హీరో వరుణ్‌ సందేశ్‌ చెప్పారు. ‘సత్యం’ రాజేశ్, వరుణ్‌ సందేశ్, గగన్, రవి హీరోలుగా, కశికా కపూర్, దివి హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కాస్ట్‌’. ఏకే జంపన్న రచన–దర్శకత్వంలో గోల్డెన్‌ ప్రోడక్షన్స్  బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ‘సత్యం’ రాజేశ్‌ మాట్లాడుతూ–‘‘ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని సెన్సిటివ్‌పాయింట్‌తో జంపన్నగారు ఈ కథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.

‘‘మన నిత్య జీవితంలో కులం ఎలా ప్రభావం చూపుతుందో ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అని ఏకే జంపన్న తెలిపారు. ‘‘మా బ్యానర్‌లో తొలి చిత్రమిది. 90 శాతం షూటింగ్‌ పూర్తయ్యింది. జూన్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని కోటేశ్వరరావు చెప్పారు. ‘‘ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు గగన్‌ బాబు, రవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement