ఆసెట్, ఆఈట్‌ ఫలితాలు విడుదల | AUCET AUEET Results declared | Sakshi
Sakshi News home page

ఆసెట్, ఆఈట్‌ ఫలితాలు విడుదల

May 16 2019 12:26 PM | Updated on May 16 2019 12:29 PM

AUCET AUEET Results declared - Sakshi

ఏయూక్యాంపస్‌ (విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు, సమీకృత ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, ఆఈట్‌ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఫలితాలను విడుదల చేశారు. 14 కోర్సుల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించింది. సైన్స్ కోర్సులో జియాలజీలో 91 మార్కులతో అబ్దుల్ లతీఫ్ టాపర్‌గా నిలిచాడు. ఆర్ట్స్ కోర్సుల్లో 86 మార్కులతో వాసాగణపతిరావు టాపర్‌గా నిలిచాడు. ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో తంగిరాల జయశ్రీలక్ష్మీ సావిత్రి టాపర్‌గా నిలిచారు. ఐదురోజుల్లోనే రికార్డు స్ధాయిలో ఫలితాలు విడుదల చేశామని జి.నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement