breaking news
andra viswavidyalayam
-
ఆసెట్, ఆఈట్ ఫలితాలు విడుదల
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఫలితాలను విడుదల చేశారు. 14 కోర్సుల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించింది. సైన్స్ కోర్సులో జియాలజీలో 91 మార్కులతో అబ్దుల్ లతీఫ్ టాపర్‌గా నిలిచాడు. ఆర్ట్స్ కోర్సుల్లో 86 మార్కులతో వాసాగణపతిరావు టాపర్‌గా నిలిచాడు. ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో తంగిరాల జయశ్రీలక్ష్మీ సావిత్రి టాపర్‌గా నిలిచారు. ఐదురోజుల్లోనే రికార్డు స్ధాయిలో ఫలితాలు విడుదల చేశామని జి.నాగేశ్వరరావు తెలిపారు. -
30 న ఏపీ సెట్
విశాఖపట్నం: ఈ నెల 30న ఏపీసెట్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. 31 సబ్జెక్టులపై పరీక్ష ఉంటుందని వైస్‌ఛాన్స్‌లర్ నాగేశ్వరరావు తెలిపారు. ఆరు రీజనల్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏపీసెట్‌కు 43,023 దరఖాస్తులు వచ్చాయన్నారు. విశాఖ, రాజమండ్రి,, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతిలలో పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ర్యాగింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా యాంటీ ర్యాగింగ్ పోస్టర్లును వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు.