ఈ నెల 30న ఏపీసెట్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది.
30 న ఏపీ సెట్
Jul 12 2017 12:50 PM | Updated on Aug 18 2018 8:49 PM
విశాఖపట్నం: ఈ నెల 30న ఏపీసెట్‌ను ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. 31 సబ్జెక్టులపై పరీక్ష ఉంటుందని వైస్‌ఛాన్స్‌లర్ నాగేశ్వరరావు తెలిపారు. ఆరు రీజనల్ కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏపీసెట్‌కు 43,023 దరఖాస్తులు వచ్చాయన్నారు.
విశాఖ, రాజమండ్రి,, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతిలలో పరీక్ష ఉంటుందని ఆయన తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ర్యాగింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా యాంటీ ర్యాగింగ్ పోస్టర్లును వీసీ నాగేశ్వరరావు విడుదల చేశారు.
Advertisement
Advertisement