ఏటీఎమ్ చోరీకి విఫలయత్నం | ATM robbery attempt | Sakshi
Sakshi News home page

ఏటీఎమ్ చోరీకి విఫలయత్నం

Apr 10 2015 8:23 AM | Updated on Aug 30 2018 5:24 PM

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో ఎస్బీహెచ్ ఏటీఎమ్ చోరీకి దుండగులు గురువారం అర్థరాత్రి విఫలయత్నం చేశారు.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో ఎస్బీహెచ్ ఏటీఎమ్ చోరీకి దుండగులు గురువారం అర్థరాత్రి విఫలయత్నం చేశారు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఎటీఎం కేంద్రం వద్దకు చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు పరారైయ్యారు.

దాంతో పోలీసులు వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించి... కేసు నమోదు చేశారు. పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement