తెలంగాణ, సమైక్య నినాదాలో హోరెత్తిన అసెంబ్లీ | assembly adjourned one hour over Telangana bill | Sakshi
Sakshi News home page

తెలంగాణ, సమైక్య నినాదాలో హోరెత్తిన అసెంబ్లీ

Jan 4 2014 9:10 AM | Updated on Sep 2 2017 2:17 AM

తెలంగాణ, సమైక్య నినాదాలో హోరెత్తిన అసెంబ్లీ

తెలంగాణ, సమైక్య నినాదాలో హోరెత్తిన అసెంబ్లీ

అసెంబ్లీలో రెండోరోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ హోరెత్తింది.

హైదరాబాద్ : అసెంబ్లీలో రెండోరోజు కూడా అదే పరిస్థితి నెలకొంది. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ హోరెత్తింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే శనివారం శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు.

దాంతో ఇరు ప్రాంతాల సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభలో సమైక్య తీర్మానం పెట్టాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో  సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. దాంతో సమావేశాలను స్పీకర్ గంటపాటు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement