
గంటపాటు శాసనసభ వాయిదా
శాసనసభ బుధవారం ఉదయం ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది.
హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈరోజు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. బుధవారం ఉదయం శాసనసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. సమావేశాలు మొదలవగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో విపక్ష సభ్యులు వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించాల్సిందేనని పట్టుబట్టారు. ఇరుప్రాంతాల సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.