టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిందే: దిగ్విజయ్‌ | As per his word.. KCR should merge TRS with Congress, says Digvijay Singh | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిందే: దిగ్విజయ్‌

Jan 30 2014 5:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిందే: దిగ్విజయ్‌ - Sakshi

టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సిందే: దిగ్విజయ్‌

గతంలో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీని విలీనం చేయాల్సిందేనని ఓ ఆంగ్ల టెలివిజన్ చానెల్ తో మాట్లాడుతూ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు సహకరిస్తే వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో నూటికి నూరుశాతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ 100 శాతం మద్దతిస్తుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. 
 
రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంపిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2013పై గురువారంతో ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజన బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement