CM KCR: ఓపెన్‌ ఛాలెంజ్‌.. ముందస్తు ఎన్నికల దిశగా సీఎం కేసీఆర్‌?

Telangana CM KCR Interesting Comments On Early Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ కామెంట్స్‌.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌, బీజేపీలు డేట్‌ చెప్తే అసెంబ్లీని రద్దు చేస్తానని.. ముందస్తు ఎన్నికలకు వెళదామంటూ సీఎం కేసీఆర్‌ ఛాలెంజ్‌ చేశారు. మొదటి సారిగా ముందస్తు ఎన్నికలపై కేసీఆర్‌ వ్యాఖ్యలపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌ ఆచితూచి స్పందిస్తున్నాయి.
చదవండి: అసమర్థ ప్రధానితో దేశం అథోగతి.. మోదీపై కేసీఆర్‌ విమర్శల వర్షం

దేశంలో అన్ని రకాలుగా అథోగతి పాలవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసమర్థ పాలన, బీజేపీ విధానాలే కారణమంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం తీవ్రస్థాయిలో విమర్శించారు. దేశం ఇంత అసమర్థ ప్రధానిని ఇంతకుముందెన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. నిష్క్రియ, అవివేక, అసమర్థ పాలనను మోదీ సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశాన్ని జలగలా పీడిస్తోందని, ఇందిరాగాంధీ గతంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తే.. ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదని..  అనడం అహంకారం.. వివేకానికి నిదర్శనం. వాళ్లకు దమ్ముంటే డేట్‌ డిక్లేర్‌ చేస్తే నేను అసెంబ్లీ రద్దుకు సిద్ధమంటూ కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? మేం స్కాంస్టర్లము కాదు. కుంభకోణాలు చేయలేదు. అపకీర్తి మూట కట్టుకోలేదు. ప్రజల కోసం మంచి పనులు చేశాం. వాళ్లే గెలిపిస్తారు. దేశ వ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని బీజేపీ భయపడుతోందని కేసీఆర్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top