
అరుణ్‌జైట్లీ దిష్టిబొమ్మ దహనం
కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నగరంలోని బంగారు దుకాణదారులు సోమవారం కేంద్ర ఆర్థిక .....
అనంతపురం న్యూటౌన్ : కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నగరంలోని బంగారు దుకాణదారులు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముందుగా వారు స్వర్ణకారులు, కార్మిక, వర్తక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద రాస్తారోకో చేశారు. అక్కడే మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. జైట్లీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
సంఘం అధ్యక్షుడు మహబూబ్‌బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకాన్ని పెంచడంతో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. రూ.2 లక్షల బంగారు కొనుగోళ్లపై పాన్‌కార్డు తప్పనిసరి నిబంధనను ఉపసంహరించుకోవాలన్నారు. ఈనెల 17 వరకు దుకాణాల బంద్ కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం గౌరవాధ్యక్షుడు గొంది జనార్దన్, ప్రధాన కార్యదర్శి మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.