
'చంద్రబాబును అరెస్ట్ చేయండి'
టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేత గౌతంరెడ్డి డిమాండ్ చేశారు.
విజయవాడ: టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేత గౌతంరెడ్డి డిమాండ్ చేశారు. సెక్షన్ 34, 107, 420, 120B కింద చంద్రబాబు పై కేసులు నమోదు చేయాలన్నారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గౌతం రెడ్డి మండిపడ్డారు.