15లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి | Arrangements must be completed within 15 | Sakshi
Sakshi News home page

15లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి

Dec 10 2013 2:43 AM | Updated on Sep 5 2018 2:07 PM

ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాల ముగిం పు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు 15వ తేదీలో పూర్తి చేయాలని...

హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాల ముగిం పు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు 15వ తేదీలో పూర్తి చేయాలని కలెక్టర్ కిషన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏర్పా ట్ల పరిశీలనలో భాగంగా సోమవారం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, మునిసిపల్ కమిషనర్ సువర్ణదాస్ పాండ, డీఆర్‌డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా దేవాదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి.మల్లేషం, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్‌డీఓ మధు, ఎమ్మార్వో విజయ్‌కుమార్ సందర్శిం చారు.

ఈ సందర్భంగా కల్యాణమండప నిర్మాణపై ఆధికారులతో సమీక్షించారు. స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆలయానికి వెళ్లే మా ర్గం కుదించుకుపోయిందని, గ్రానెట్ రాళ్లతో సందర్శకులకు గాయాలయ్యే అవకాశం ఉంద ని రోడ్డును వెడల్పు చేయడంతోపాటు దేవాదా య శాఖ వారు పుజాసామగ్రి స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి ఆరు గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఆదేశించారు. 2014 జూన్‌లోగా కల్యాణమండపం పూర్తికావాలని, నిర్మాణంలో భాగంగా అక్కడక్కడా ఉన్న రాళ్లను నాలుగు రోజుల్లో తొలగించాలని పురావస్తుశాఖ జిల్లా అధికారి గురుమూర్తికి చెప్పారు.

విద్యుత్ దీపాల అలంకరణ, సౌండ్ అండ్ లైట్ సిస్టం, స్టేజీ, వీఐపీల కోసం ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్ ఉపేంద్రసింగ్, మనోహ ర్, డీపీఆర్వో వెంకటరమణ. ఆలయ ఈఓ వద్దిరాజు రాజేందర్‌రావు, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, కుడా వైస్ చైర్మన్ యాదగిరిరెడ్డి, ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, భీమ్‌రావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముం దు అధికారులు రుద్రేశ్వరస్వామి వారికి ప్రదోషకాల పూజలు నిర్వహించారు.
 
ఖిలాలో వేదిక స్థలాల పరిశీలన

ఖిలావరంగల్  : కాకతీయ ఉత్సవాల ముగిం పు వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో అనువైన స్థలం కోసం సోమవారం ఖిలావరంగల్‌లోని స్వయంభు శ్రీశంభులింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని శిల్పాల ప్రాంగణం, ఖుష్ మహల్ పక్కన స్థలాన్ని కలెక్టర్ బృందం పరిశీలించారు. పర్యాటకులకు శిల్పాల ప్రాంగ ణం అనువుగా ఉంటుందని, అనుమతివ్వాల ని కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులను కలెక్టర్ కోరారు. ముందస్తుగా మరో స్థలాన్ని చూసారు. ఉత్సవాల వేదిక స్థలానికి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పా రు. అలాగే రూ.5కోట్లతో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న సౌండ్ అండ్ లైటింగ్ పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ కక్కే సారయ్య కలెక్టర్ ను కలిసి తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ‘నాఊరు ఓరుగల్లు’ చారిత్రక పుస్తకాన్ని అందజేశారు.
 
రుద్రేశ్వరుడికి గుమ్మడి  గోపాలకృష్ణ పూజలు

 హన్మకొండ కల్చరల్ : ప్రముఖ టీవీ, సినీనటుడు యోగివేమన పాత్రధారి గుమ్మడి గోపాలకృష్ణ సోమవారం సాయంత్రం శ్రీరుద్రేశ్వరస్వామికి పూజలు చేశారు. వారితో పాటు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు శేఖర్‌బాబు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement