breaking news
Pausumibasu
-
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్..
కేసముద్రం మార్కెట్ కార్యదర్శికి వ్యాపారుల వినతి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల తరలింపే కారణం కేసముద్రం, న్యూస్‌లైన్ : అధికారుల అవగాహనా రాహిత్యం కారణంగా రైతులే ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. ఒక పక్క కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోవడంతో కాలంటాలు నిలిపివేశారు. ఇప్పటికే కొనుగులు చేసి నిల్వ ఉన్న ధాన్యాన్ని తరలిం చేందుకు ఏ ఒక్క లారీని వదలకుండా పోలీ సుల సహకారంతో వినియోగిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక మార్కెట్లో వ్యవసాయోత్పత్తుల ఎగుమతి కోసం వ్యాపారులు తెప్పించుకున్న లారీలను సైతం కొనుగోలు కేం ద్రాల వద్దకు మళ్లించారు. దీంతో ఇతర వాహనాలను వెతుక్కుని సరుకులను ఎగుమతి చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వ్యాపారులు వాపోయారు. ఇప్పటికే కేసముద్రం పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోమటిపల్లి, కేసముద్రంవిలేజ్, ఇనుగుర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 20 వేలకుపైగా ధాన్యం బస్తాలు, ఐకేసీ ద్వారా కల్వల, కాట్రపల్లి, అర్పనపల్లి, ఇనుగుర్తి గ్రామాల్లోని కేంద్రాల్లో సుమారు 40వేల బస్తాలు, ధన్నసరి పీఏసీఎస్ కేంద్రంలో సుమారు 20వేల బస్తాల ధాన్యం నిల్వ ఉంది. ఆ ధాన్యాన్ని తరలించడానికి నిర్వాహకులు, పోలీసు యంత్రాంగం నానా పాట్లు పడుతున్నారు. బుధవారం మార్కెట్లోని పత్తి వ్యాపారులంతా ఏకమయ్యారు. తాము తెచ్చుకున్న లారీలన్నింటినీ కొనుగోలు కేంద్రాలకు మళ్లిస్తున్నారని, గురువారం నుంచి తాము పత్తి కొనుగోళ్లు చేపట్టలేమంటూ మార్కెట్ ప్రత్యేకహోదా కార్యదర్శి శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. -
15లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న కాకతీయ ఉత్సవాల ముగిం పు కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు 15వ తేదీలో పూర్తి చేయాలని కలెక్టర్ కిషన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఏర్పా ట్ల పరిశీలనలో భాగంగా సోమవారం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు, మునిసిపల్ కమిషనర్ సువర్ణదాస్ పాండ, డీఆర్డీఏ పీడీ విజయగోపాల్, జిల్లా దేవాదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి.మల్లేషం, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్డీఓ మధు, ఎమ్మార్వో విజయ్‌కుమార్ సందర్శిం చారు. ఈ సందర్భంగా కల్యాణమండప నిర్మాణపై ఆధికారులతో సమీక్షించారు. స్టాల్స్ ఏర్పాటు చేయడం వల్ల ఆలయానికి వెళ్లే మా ర్గం కుదించుకుపోయిందని, గ్రానెట్ రాళ్లతో సందర్శకులకు గాయాలయ్యే అవకాశం ఉంద ని రోడ్డును వెడల్పు చేయడంతోపాటు దేవాదా య శాఖ వారు పుజాసామగ్రి స్టాల్ ఏర్పాటు చేసుకోవడానికి ఆరు గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఆదేశించారు. 2014 జూన్‌లోగా కల్యాణమండపం పూర్తికావాలని, నిర్మాణంలో భాగంగా అక్కడక్కడా ఉన్న రాళ్లను నాలుగు రోజుల్లో తొలగించాలని పురావస్తుశాఖ జిల్లా అధికారి గురుమూర్తికి చెప్పారు. విద్యుత్ దీపాల అలంకరణ, సౌండ్ అండ్ లైట్ సిస్టం, స్టేజీ, వీఐపీల కోసం ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్ ఉపేంద్రసింగ్, మనోహ ర్, డీపీఆర్వో వెంకటరమణ. ఆలయ ఈఓ వద్దిరాజు రాజేందర్రావు, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ, కుడా వైస్ చైర్మన్ యాదగిరిరెడ్డి, ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, భీమ్రావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముం దు అధికారులు రుద్రేశ్వరస్వామి వారికి ప్రదోషకాల పూజలు నిర్వహించారు. ఖిలాలో వేదిక స్థలాల పరిశీలన ఖిలావరంగల్ : కాకతీయ ఉత్సవాల ముగిం పు వేడుకలు నిర్వహించనున్న నేపథ్యంలో అనువైన స్థలం కోసం సోమవారం ఖిలావరంగల్‌లోని స్వయంభు శ్రీశంభులింగేశ్వర స్వామి ఆలయ సమీపంలోని శిల్పాల ప్రాంగణం, ఖుష్ మహల్ పక్కన స్థలాన్ని కలెక్టర్ బృందం పరిశీలించారు. పర్యాటకులకు శిల్పాల ప్రాంగ ణం అనువుగా ఉంటుందని, అనుమతివ్వాల ని కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాధికారులను కలెక్టర్ కోరారు. ముందస్తుగా మరో స్థలాన్ని చూసారు. ఉత్సవాల వేదిక స్థలానికి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పా రు. అలాగే రూ.5కోట్లతో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న సౌండ్ అండ్ లైటింగ్ పనుల గురించి తెలుసుకున్నారు. అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ కక్కే సారయ్య కలెక్టర్ ను కలిసి తన పదవీ కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ‘నాఊరు ఓరుగల్లు’ చారిత్రక పుస్తకాన్ని అందజేశారు. రుద్రేశ్వరుడికి గుమ్మడి గోపాలకృష్ణ పూజలు హన్మకొండ కల్చరల్ : ప్రముఖ టీవీ, సినీనటుడు యోగివేమన పాత్రధారి గుమ్మడి గోపాలకృష్ణ సోమవారం సాయంత్రం శ్రీరుద్రేశ్వరస్వామికి పూజలు చేశారు. వారితో పాటు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు శేఖర్‌బాబు పాల్గొన్నారు.