తెలంగాణవారినే నియమించాలి: విద్యార్థుల ఆందోళన | Appoint Vice-chancellor, Registrar from Telangana region: NG Ranga students | Sakshi
Sakshi News home page

తెలంగాణవారినే నియమించాలి: విద్యార్థుల ఆందోళన

Sep 13 2013 10:37 AM | Updated on Sep 1 2017 10:41 PM

రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు శుక్రవారం మరోసారి ఆందోళనకు దిగారు. అన్ని గేట్లకు తాళం వేసిన విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ : రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మరోసారి ఆందోళనకు దిగారు. అన్ని గేట్లకు తాళం వేసి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ వర్సిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, డీన్ పదవుల్లో తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్‌చేస్తూ.. మంగళవారం రాజేంవూదనగర్‌లోని వర్సిటీ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. పరిపాలన భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.

వీసీ నియామకంలో తమ డిమాండ్ సాధన కోసం విద్యార్థులు, ఉద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నా సీమాంధ్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి తెలంగాణ వ్యక్తిని వీసీగా నియమించాలని  ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు గత కొంతకాలంగా ఉద్యమిస్తున్నారు. తమ డిమాండ్ సాధన కోసం భారీ నిరసనలు చేపట్టారు. అయినా సర్కారు తీరు ఏమాత్రం మారకపోవడంపై విద్యార్థులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement