స్పెక్ట్రమ్ ఈక్విటీకి గ్రీన్‌సిగ్నల్ | APERC green signal to spectrum Equity | Sakshi
Sakshi News home page

స్పెక్ట్రమ్ ఈక్విటీకి గ్రీన్‌సిగ్నల్

Aug 14 2013 11:40 PM | Updated on Nov 9 2018 6:16 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి స్పెక్ట్రమ్ పవర్ కంపెనీ తీసుకున్న రుణాన్ని ఈక్విటీగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశాలు జారీ చేసింది.

సాక్షి, హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నుంచి స్పెక్ట్రమ్ పవర్ కంపెనీ తీసుకున్న రుణాన్ని ఈక్విటీగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఇన్‌చార్జి చైర్మన్ శేఖర్‌రెడ్డి, సభ్యుడు అశోకాచారి ఆదేశాలిచ్చారు. కంపెనీ ఈక్విటీని రూ. 106.6 కోట్లుగా కాకుండా రూ. 224.53 కోట్లుగా పరిగణించాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా ఈక్విటీపై ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను 1998 నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రోత్సాహకాల రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ.100 కోట్ల మేరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తం విద్యుత్ చార్జీల రూపంలో ప్రజలపైనే పడనుంది. కాగా, ఎల్‌వీఎస్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని (పీపీఏ) రద్దు చేయాలని డిస్కంలు వేసిన పిటిషన్‌ను ఈఆర్‌సీ తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement