ఏపీసీసీ నూతన కార్యదర్శిగా షేక్‌ షానవాజ్‌ | APCC chief appoints new leaders to committee | Sakshi
Sakshi News home page

ఏపీసీసీ నూతన కార్యదర్శిగా షేక్‌ షానవాజ్‌

Feb 13 2017 4:28 PM | Updated on Aug 29 2018 6:00 PM

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా షేక్‌ షానవాజ్‌ ను, సంయుక్త కార్యదర్శిగా జి.వెంకటేష్‌ను, కార్యనిర్వాహక కార్యదర్శిగా పూల ప్రసాద్‌ లను నియమించారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా షేక్‌ షానవాజ్‌ ను, సంయుక్త కార్యదర్శిగా జి.వెంకటేష్‌ను, కార్యనిర్వాహక కార్యదర్శిగా పూల ప్రసాద్‌ లను నియమించారు. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షుడు డా.ఎన్‌.రఘువీరారెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నియామక ఉత‍్తర్వులను అనంతపురం జిల్లా ఇన్‌చార్జి కె.రవిచంద్రారెడ్డి చేతుల మీదగా నేతలు అందుకున్నారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్న నేతలు, అవకాశం ఇచ్చిన పార్టీ చీఫ్‌ రఘువీరారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement