ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం పూర్తయింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం పూర్తయింది. ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఐదు స్థానాలకు గాను ఐదుగురే నామినేషన్లు వేశారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిభాభారతి, ఎంఎ షరీఫ్, టీడీ జనార్ధనరావు నామినేషన్లు వేశారు.
బీజేపీ తరపున సోము వీర్రాజు నామివేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ సీపీ తరపున డీసీ గోవిందరెడ్డి బుధవారమే నామినేషన్ వేశారు. వీటిని పరిశీలించిన తర్వాత ఎన్నిక ఏకగ్రీవమని శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించే అవకాశముంది.