అవినీతిపై ఆయుధం.. లోకాయుక్త 

AP Lokayukta Justice P Lakshman Reddy comments on Corruption - Sakshi

ఏపీ లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి 

సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మంగళగిరి: అవినీతిపై ప్రజా ఆయుధంగా లోకాయుక్త వ్యవస్థ తోడ్పడుతుందని ఆంధ్రప్రదేశ్‌ లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్లో ఆయనకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అవినీతిపై సాక్ష్యాలుంటే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని, న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ అవినీతి రహిత, పారదర్శక పాలన అందించాలని బలంగా కోరుకుంటున్నారని, లోకాయుక్త నియామకం ద్వారా ఆయన ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. కార్యక్రమంలో మానసిక నిపుణుడు డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, సెంట్రల్‌ కస్టమ్స్‌ జాయింట్‌ కమిషనర్‌ శ్రీకాంత్, జీఎస్టీ డిప్యూటీ కమిషనర్‌ సీఎస్‌ రాజు, జనచైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ జి విజయసారథి పాల్గొన్నారు. 

సీఎంను కలిసిన జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి 
లోకాయుక్త జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగరి పట్టణంలోని లక్ష్మీనృసింహస్వామిని జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.  
(టీడీపీ) తదితరులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top