ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శ రైతులను తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని ఏపీ ఆదర్శ రైతుల సంఘం అధ్యక్షులు ఎన్. శేఖర్ తెలిపారు.
సమస్యలపై వైఎస్సార్ సీపీ అధ్యక్షులు జగన్‌కు వినతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదర్శ రైతులను తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలలో నిరసనలు చేపట్టాలని ఏపీ ఆదర్శ రైతుల సంఘం అధ్యక్షులు ఎన్. శేఖర్ తెలిపారు. ఆదర్శ రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ అండగా ఉండాలని కోరుతూ సోమవారం ఆదర్శ రైతుల ప్రతినిధి బృందం వైఎస్సార్ సీపీ శాసన సభా పక్ష నేత, ఆ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఆదర్శ రైతులకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారన్నారు.