ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

AP ICET Results out - Sakshi

సాక్షి, విజయవాడ : ఏపీ ఐసెట్2019 ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏపీఐసెట్ 2019 టెస్ట్‌ను నిర్వహించింది. ఏపీ ఐసెట్‌ 2019 ఫలితాలను బుధవారం విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు52,736 మంది దరఖాస్తు చేసుకోగా, 48,445మంది విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే ఐదువేల మంది అధికంగా దరఖాస్తు చేసుకోగా, కంప్యూటర్ బేసిడ్ కామన్ ఎంట్రన్స్ మొదటిగా ఏపీలో ప్రారంభించామని విజయరాజు అన్నారు.

జులై మూడోవారం నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన కారుమూరి నాగసుమంత్ తొలిర్యాంకు సాధించారు. తూర్పు గోదావరికి చెందిన కంటె కావ్యాశ్రీ రెండు, విజయవాడకి చెందిన నరహరిశెట్టి శివసాయి పవన్ మూడో ర్యాంకు సాధించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top