ఏపీ ఐసెట్‌-2018 ఫలితాలు | AP ICET Results 2018 Released | Sakshi
Sakshi News home page

ఏపీ ఐసెట్‌-2018 ఫలితాలు

May 12 2018 1:14 PM | Updated on Mar 28 2019 5:34 PM

AP ICET Results  2018  Released - Sakshi

 సాక్షి, విజయవాడ: ఎంబీఏ, ఎంసీఏ కోర్టులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2018  ఫలితాలను శనివారం విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు  విడుదల చేశారు. ఈ పరీక్షకి 48,635 మంది హజరుకాగా 45,037 మంది అర్హత సాధించారు. ఐసెట్‌లో 92.60 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 6 శాతం ఉత్తీర్ణత పెరిగినట్లు మంత్రి తెలిపారు. అన్ని సెట్ల పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించడంతోపాటు, ఫలితాలను కూడా వెల్లడించామని మంత్రి అన్నారు. మొదటిర్యాంక్‌ గుంటూరుకు చెందిన సీహెచ్‌ ప్రసన్న కుమార్‌ సాధించగా,  రెండో, మూడో ర్యాంకులను వరుసగా అనంతపురానికి చెందిన భరత్‌ కుమార్‌ , సాయికుమార్‌ రెడ్డిలు కైవసం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement