‘కరోనా’ లక్షణాలు కనిపిస్తే 104కు కాల్‌ చేయండి

AP Health Ministry Special Secretary Jawahar Reddy Comments On Coronavirus - Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో కరోనా వైరస్‌(కోవిడ్‌ -19) వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సూచించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఇళ్లలో ఉండాలని చెప్పామని, వారి కోసం హోమ్‌ ఐసోలేటెడ్‌ చర్యలు చేపట్టామని తెలిపారు.
(చదవండి : కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు)

ఇప్పటివరకు 7వేల మంది తెలుగువారు విదేశాల నుంచి ఏపీకి వచ్చారని వెల్లడించారు. ఇటలీ, స్పెయిన్‌, ఇరాక్‌, సౌత్‌ కొరియా, జపాన్‌ నుంచి వచ్చిన వారికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. విదేశాల నుంచి వచ్చినవారి వివరాల కోసం గ్రామస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నామన్నారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎమ్‌, పీహెచ్‌సీ డాక్టర్లతో పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. విదేశాలనుండి వచ్చిన వారిని 14 రోజులు క్వారెంటైన్‌ ఫెసిలీటీస్‌లో ఉంచి వ్యాధి లక్షణాలు లేవని తెలిసిన తరువాతే ఇళ్లకు పంపుతున్నామని చెప్పారు. ఎరికైనా కరోనా లక్షణాలు కనబడితే 104కు కాల్‌ చేయమని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top