కరోనా వైరస్‌పై ఆందోళన వద్దు | AP Health Department Release Bulletin On Corona Virus Prevention | Sakshi
Sakshi News home page

కరోనా వైరస్‌పై ఆందోళన వద్దు

Mar 7 2020 10:07 AM | Updated on Mar 7 2020 10:35 AM

AP Health Department Release Bulletin On Corona Virus Prevention - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ ( కోవిడ్‌ –19)పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ డాక్టర్ కేఎస్‌ జవహర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా వైరస్‌పై వదంతులు, నిరాధార ప్రచారాన్ని విశ్వసించవద్దని చెప్పారు. కరోనా లక్షణాలేమైనా ఉంటే తక్షణం మాస్క్‌ను ధరించాలని ఆయన సూచించారు. కరోనా వైరస్‌ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్‌ రూం నంబరు (0866-2410978)కి తెలియజేయాలన్నారు. వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ నంబరులో సంప్రదించాలని తెలిపారు.(ఏపీలో 'కోవిడ్‌' లేదు)

ఏపీలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు..
కరోనా వైరస్‌ ప్రభావిత దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన 378 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని పేర్కొన్నారు. 153 మంది ఇళ్లలోనే వైద్యుల పరిశీలనలో ఉన్నారన్నారు. 218 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురి పరిస్థితి  స్థిమితంగా ఉందని తెలిపారు. 27 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 20 మందికి నెగిటివ్ అని తేలిందని.. ఏడుగురి శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటి వరకు ఏపీలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని స్పష్టం చేశారు. (అమ్మో.. చైనా నౌక!)

ప్రయాణికులపై నిఘా..
కరోనా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టామని జవహర్‌ రెడ్డి తెలిపారు. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ‍్రస్కీనింగ్‌ చేస్తున్నామని చెప్పారు. డ్రగ్స్‌ డీజీ ఆధ్వర్యంలో డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్లు 382 మెడికల్‌ షాపులపై దాడులు నిర్వహించారని తెలిపారు. అధిక ధరలకు మాస్క్ లు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్ లు కూడా రద్దు చేస్తామన్నారు. మెడికల్ షాపులపై దాడుల్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. (ఆందోళన వద్దు.. అప్రమత్తం కావాలి)

Advertisement
 
Advertisement
Advertisement