నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు | AP Govt Released 6.55 Crores Funds To Nava Nirmana Deeksha | Sakshi
Sakshi News home page

నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు

Jul 6 2018 7:19 AM | Updated on Aug 18 2018 8:08 PM

AP Govt Released 6.55 Crores Funds To Nava Nirmana Deeksha - Sakshi

సాక్షి, అమరావతి : గత నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దీక్షల కోసం గతంలోనే జిల్లాకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.13 కోట్ల రూపాయలను, విజయవాడలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభకు రూ.10 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నిధులు సరిపోలేదని, మరిన్ని నిధులు వ్యయం అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లాకు మరో రూ.50 లక్షల చొప్పున రూ.6.50 కోట్లను, విజయవాడలో సీఎం సభకు మరో రూ.5 లక్షలను ప్రణాళికా శాఖ మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement