‘ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులే’ | AP Govt has Issued Notification All RTC Workers Are Government Employees | Sakshi
Sakshi News home page

‘ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులే’

Dec 31 2019 2:09 PM | Updated on Dec 31 2019 3:10 PM

AP Govt has Issued Notification All RTC Workers Are Government Employees - Sakshi

సాక్షి, అమరావతి : జనవరి 1నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిషికేషన్‌ జారీ చేసింది. జనవరి 1వ తేదిని ఆర్టీసీ ఉద్యోగుల నియామక డేగా పరిగణించనున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కార్మికులను ప్రభుత్వంలో విలీనం) చట్టం 2019 ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా రవాణా విభాగం ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను పరిగణిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల  తరహాలోనే ఖజానా నుంచి నేరుగా ఆర్టీసీ కార్మికులు జీతాలు అందుకోనున్నారు.

51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి
జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. ఇ‍ప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణాశాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement