మద్య నియంత్రణ దిశగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government Increased Alcohol Rates - Sakshi

25శాతం పెరగనున్న మధ్యం ధరలు

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మద్యం నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని అడుగులు ముందుకేసింది. మద్యం ధరలను 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా, దుకాణాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని మద్యం దుకాణాల సంఖ్య తగ్గించాలని నిర్ణయం తీసుకుంది.
(చదవండి : మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌ )

కాగా, కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 4 నుంచి మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. కోవిడ్‌ కంటైన్‌మెంట్‌ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లతోపాటు రెడ్‌ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే, ఇందుకు కొన్ని పరిమితులు విధించింది. మద్యం మాత్రమే విక్రయించే దుకాణాలు అయి ఉండాలి. విక్రయాల సమయంలో దుకాణం వద్ద కొనుగోలు దారులు భౌతిక దూరం(ఆరడుగుల ఎడం) పాటించాలి. అయిదుగురికి మించి దుకాణం వద్ద ఉండరాదు. మార్కెట్‌ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్‌ జోన్లలోని మాల్స్‌లో ఉన్న వాటికి ఈ వెసులుబాటు వర్తించదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top