ఏపీ ఎంసెట్‌పై రేపు నిర్ణయం | AP eamcet declaration to be done tomorrow | Sakshi
Sakshi News home page

ఏపీ ఎంసెట్‌పై రేపు నిర్ణయం

Published Sun, Feb 22 2015 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM

ఆంధ్రప్రదేశ్ ఎంసెంట్ నిర్వహణపై సోమవారం తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెంట్ నిర్వహణపై సోమవారం తుది నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంసెట్ వివాదంపై రాష్ట్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యా శాఖ అధికారులు శనివారం సీఎం చంద్రబాబు తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి వేరుగా ఎంసెట్ నిర్వహించేందుకు శుక్రవారం షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో, దానివల్ల కలిగే నష్టాలు, తదుపరి కార్యాచరణపై ఈ భేటీలో చర్చించారు. మరింత ఆలోచించి ముందుకెళ్లాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సోమవారం మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement