పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంది : ఏపీ డీజీపీ

సాక్షి, అమరావతి : గోదావరికి వరదల నేపథ్యంలో పోలీస్ యంత్రాగం అప్రమత్తంగా ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎటువంటి పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్, లోకల్ పోలీసులు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. శాటిలైట్ ఫోన్స్, డ్రోన్లతో పరిస్ధితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. ముందస్తు చర్యలలో భాగంగా ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు ప్రారంభించామన్నారు. కాగా ఇంతకు మునుపే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గోదావరి వరద ఉధృతిపై ఆరా తీశారు.
ముంపు గ్రామాల్లో చేపడుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇప్పటికే ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి