వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి భారీ కేటాయింపులు

AP Budget 2019 Allocations For YSR Aarogyasri Rs 1740 Crores - Sakshi

సాక్షి, అమరావతి : ఆంద్రప్రదేశ్‌ అసెంబ్లీలో 2019-20 సంవత్సరానికిగాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్‌లో రూ.11,399 కోట్లు కేటాయించారు. దివంగత ముఖ్యమంతి​ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఆరోగ్యశ్రీ పథకానికి పునర్‌వైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపట్టారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు కేటాయిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. 5 లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని అన్నారు. 108 అంబులెన్స్‌లకు రూ.143 కోట్లు కేటాయించారు.

వైద్యరంగానికి చేయూత..

  • ఆస్ప‌త్రుల్లో మౌలిక వ‌స‌తుల‌కు రూ.1500 కోట్లు
  • ఆశావ‌ర్క‌ర్లకు పెంచిన రూ.10 వేల వేత‌నానికి రూ.455 కోట్లు
  • మెడిక‌ల్ భ‌వ‌నాలకు రూ.68 కోట్లు
  • వైఎస్సార్ ట్రైబ‌ల్ మెడిక‌ల్ క‌ళాశాల‌కు రూ.66 కోట్లు
  • ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల-గుర‌జాలకు రూ.66 కోట్లు
  • ప్ర‌భుత్వ మెడిక‌ల్ క‌ళాశాల‌-విజ‌య‌న‌గ‌రంకు రూ.66 కోట్లు
  • ప‌లాస‌లో కిడ్నీ రీసెర్చ్‌ సెంట‌ర్, సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌కు రూ. 50 కోట్లు
  • రాష్ట్ర కేన్స‌ర్ ఇనిస్టిట్యూట్‌కు రూ.43 కోట్లు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top