ఐక్యతతో మరిన్ని విజయాలు | AP Anganwadi Workers and Helpers Union | Sakshi
Sakshi News home page

ఐక్యతతో మరిన్ని విజయాలు

Feb 12 2016 1:39 AM | Updated on Mar 28 2019 5:23 PM

స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం సంఘాన్ని చీల్చాలని చేస్తున్న ప్రయత్నాలను చైతన్యంతో ఎదుర్కొని ఐక్యతతో

ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
 కాకినాడ సిటీ : స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వం సంఘాన్ని చీల్చాలని చేస్తున్న ప్రయత్నాలను చైతన్యంతో ఎదుర్కొని ఐక్యతతో మరిన్ని విజయాలు సాధించుకుందామని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు నిచ్చింది. వేతనాల పెంచుతూ జీఓ విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ యూనియన్ విజయోత్సవ సమావేశం గురువారం సుందరయ్యభవన్‌లో జరిగింది. అనంతరం సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ నాయకులు విలేకరులతో మాట్లాడుతూ అంగన్‌వాడీల పోరాట ఫలితంగానే జీఓ నంబర్ 8 వచ్చిందన్నారు.
 
 మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసిన విధంగా 2015 నుంచి కాకుండా ఏప్రిల్ నుంచి అమలు చేయడం వల్ల అంగన్‌వాడీలు 7 నెలల వేతనాన్ని కోల్పోయారన్నారు. చలో విజయవాడలో పాల్గొన్న అంగన్‌వాడీలను తొలగించాలని ఇచ్చిన మెమోనంబర్ 5557ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అంగన్‌వాడీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇదే కొనసాగితే ఆందోళనలు చేపడతామన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.వీరలక్ష్మి, ఎస్‌కే ఫాతిమా పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement