జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్ కు అనూష | Anusha to national-level ball badminton | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్ కు అనూష

Dec 16 2016 3:29 AM | Updated on Sep 4 2017 10:48 PM

జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్ కు అనూష

జాతీయ స్థాయి బాల్‌ బ్యాడ్మింటన్ కు అనూష

జాతీయ స్థాయి అండర్‌–17 బాల్‌ బ్యాడ్మింటిన్ పోటీలకు పెదపవని భళేరావు ఉన్న త పాఠశాల విద్యార్థిని పల్లెకొండ అనూష ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం మాధవరావు గురువారం తెలిపారు.

లింగసముద్రం: జాతీయ స్థాయి అండర్‌–17 బాల్‌ బ్యాడ్మింటిన్ పోటీలకు పెదపవని భళేరావు ఉన్న త పాఠశాల విద్యార్థిని పల్లెకొండ అనూష ఎంపికైనట్లు పాఠశాల హెచ్‌ఎం  మాధవరావు గురువారం తెలిపారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విశేష ప్రతిభ కనబరచి రాష్ట్ర జట్టుకు ఎంపికైందన్నారు. ఈ నెల 19న చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని చెప్పారు. విద్యార్థినిని జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ వై శీనయ్య, ఎంఈఓ కె సూర్యప్రకాశరావు, హెచ్‌ఎం యూ మాధవరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు మురళిమోహన్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement