
అనంతపురం: జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. గోరంట్ల మండలం చెట్లమోరంపల్లికి చెందిన ముగ్గురికి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. ఈ వ్యాధితో వారం వ్యవధిలో 30 గొర్రెలు మృతిచెందాయి. ఆంత్రాక్స్ వల్లే ఈ గొర్రెలు మృతిచెందినట్లు పెనుకొండ పశు వైద్య అధికారి శుభదాస్ ధ్రువీకరించారు.
ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు గొర్రె మాంసం తినటంతో వారికి కూడా ఆంత్రాక్స్ సోకినట్లు భావిస్తున్నారు. జిల్లా వైద్య అధికారి వెంకట రమణ రోగులను పరామర్శించి వైద్య పరీక్షలు నిర్వహించారు.