నగరంలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారుకు చెందిన సతివాడ లక్ష్మికి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో అకౌంట్ ఉంది
ఆన్‌లైన్ మోసంపై ఫిర్యాదు
Mar 3 2017 8:00 PM | Updated on Sep 2 2018 4:52 PM
శ్రీకాకుళం సిటీ : నగరంలో మరో ఆన్‌లైన్ మోసం వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం నగరంలోని చిన్నబజారుకు చెందిన సతివాడ లక్ష్మికి ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో అకౌంట్ ఉంది. గురువారం గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి తాము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికి ఖాతా, పిన్ నంబర్లను సేకరించారు. కొంత సేపటి తర్వాత తన బ్యాంకు అకౌంట్ నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రూ.46,490 నగదు విత్‌డ్రా చేశారని సతివాడ లక్ష్మి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఎం.త్రినేత్రి తెలిపారు.
Advertisement
Advertisement