అనైతిక కార్యకలాపాలను విడనాడాలి | anger to so many problems | Sakshi
Sakshi News home page

అనైతిక కార్యకలాపాలను విడనాడాలి

Feb 26 2014 4:14 AM | Updated on Sep 2 2017 4:05 AM

జలు అనైతిక కార్యకలాపాలను విడనాడి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సహకరించాలని ముదినేపల్లి ఎస్‌ఐ వి.సతీష్ కోరారు.


 
 ముదినేపల్లి రూరల్,  : ప్రజలు అనైతిక కార్యకలాపాలను విడనాడి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సహకరించాలని ముదినేపల్లి ఎస్‌ఐ వి.సతీష్ కోరారు. మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకిగూడెం, పాత, కొత్త దళితవాడలు, కొరగుంటపాలెం, శ్రీహరిపురం గ్రామాల్లో మంగళవారం జనమైత్రి సమావేశాలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ జూదాలు, మద్యపానం విడనాడితేనే సమాజంలో గౌరవప్రదమైన హోదా దక్కుతుందన్నారు. గ్రామాల్లో ఘర్షణలకు తావు లేకుండా స్థానికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిం చారు. ఆయా గ్రామాల సర్పంచులు నేతల రూప, అచ్యుత రాంబాబు, బడుగు జయమ్మ, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement