
కృష్ణా జిల్లా పాదయాత్రలో వైఎస్ జగన్
సాక్షి, కైకలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. బుధవారం ఉదయం 157వ రోజు పాదయాత్రను కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి శివారు నుంచి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఆయనతో కలిసి నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించి జననేత ముందుకు కదిలారు.
పెయ్యేరు, డాకరం క్రాస్, కానుకొల్లు, పుట్ల చెరువు క్రాస్, లింగాల మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. పెరికగూడెంలో దళితుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొంటారు. సమావేశం అనంతరం రాత్రికి ఆయన ఇక్కడే బస చేస్తారు.