చెన్నూరు కుర్రోడికి ఏడాదికి రూ.1.24 కోట్ల జీతం | Chennur Student Get 1.2 Crore Package | Sakshi
Sakshi News home page

చెన్నూరు కుర్రోడికి ఏడాదికి రూ.1.24 కోట్ల జీతం

Jul 20 2019 9:24 AM | Updated on Jul 20 2019 9:24 AM

Chennur Student Get 1.2 Crore Package - Sakshi

కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు బుద్దా కార్తీక్‌.

సాక్షి, కైకలూరు: కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు కృష్ణా జిల్లాకు చెందిన బుద్దా కార్తీక్‌. ముదినేపల్లి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన గోపాలకృష్ణమూర్తి, సత్య సులోచనల కుమారుడు కార్తీక్‌. లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్లో పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు. హైదరాబాద్‌లోని బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌)లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి క్యాల్‌కమ్‌ మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం పొందాడు. తర్వాత అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్‌లో మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు పూర్తి చేశాడు. ఇప్పుడు అమెజాన్‌ కంపెనీలో ఏడాదికి రూ.కోటీ 24 లక్షల జీతం అందుకుంటున్నాడు. శుక్రవారం లిటల్‌ ప్లవర్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బలుసు రఘురామయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ సాయి సుమిత్, ఉపాధ్యాయులు కార్తీక్‌కు అభినందనలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement