 
															అంగన్‌వాడీలపై లాఠీచార్జి అమానుషం
తమ న్యాయమైన సమస్యలు తీర్చాలంటూ హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలపై పోలీ సులు లాఠీచార్జి చేయడం అమానుషమని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వీరశేఖర్ పేర్కొన్నారు.
	 బద్వేలుఅర్బన్ ,
	 తమ న్యాయమైన సమస్యలు తీర్చాలంటూ హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలపై పోలీ సులు లాఠీచార్జి చేయడం అమానుషమని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వీరశేఖర్ పేర్కొన్నారు.
అంగన్‌వాడీలపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీలు ఎంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రభుత్వంగుడ్డిగా వ్యవహరించడం దారుణమన్నారు.
	6 నెలల నుంచి ఇప్పటివరకు పెంచిన జీతభత్యాలు ఇవ్వలేదని వాపోయారు.  ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్, చాంద్‌బాష, వెంకటరమణ, వెంకటపతి, చిన్ని తదితరులు పాల్గొన్నారు.
	 
	 
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
