'ఏపీ సీఎం చంద్రబాబే పెద్ద టెర్రరిస్టు' | Andhra pradesh cm chandra babu is a terrorist, says chiluka chandra shekar | Sakshi
Sakshi News home page

'ఏపీ సీఎం చంద్రబాబే పెద్ద టెర్రరిస్టు'

Apr 15 2015 12:46 AM | Updated on Aug 14 2018 11:24 AM

టెర్రరిజంతో అధికారం చెలాయించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద టెర్రరిస్టని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొట్టి శ్రీరాములు నెల్లూరు టౌన్: టెర్రరిజంతో అధికారం చెలాయించాలని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద టెర్రరిస్టని పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ మంగళవారం పద్మావతి మహిళా గ్రంథాలయం ఆవరణంలో ఓపీడీఆర్, పౌరహక్కుల సంఘం సంయుక్తంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పథకం ప్రకారమే చంద్రబాబు ప్రభుత్వం తమిళ కూలీలను పట్టుకుని హతమార్చిందని ఆరోపించారు. అయితే ఒక పత్రిక మాత్రం తమిళ కూలీల హత్యాకాండను ఎన్‌కౌంటర్‌గా పేర్కొంటూ ప్రభుత్వానికి వంతపాడుతోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement