
టీటీడీ సహా అన్ని పాలకమండళ్లు రద్దు
బీసీలు నష్టపోకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు అనుమైన మార్గాలు అన్వేషించేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంతివర్గం నిర్ణయించింది.
హైదరాబాద్: బీసీలు నష్టపోకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు అనుమైన మార్గాలు అన్వేషించేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంతివర్గం నిర్ణయించింది. శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ సహా అన్ని పాలకమండళ్లు రద్దు చేయాలని, గ్రామ స్థాయి నుండి అధికారులను బదిలీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు.
మైనింగ్‌లో 25 శాతం డ్వాక్రా మహిళలకు కేటాయించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ వేయాలని, 16 నుండి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. రుణమాఫీ నిధులు, 1956 స్థానికత అంశం, భూములు, రిజిస్ట్రేషన్ ధరల పెంపు అంశాలు చర్చకు రాలేదు.