ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ఆరంభం కాగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలైంది. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రివిలేజ్ కమిటీ ఇవాళ శాసనసభలో నివేదిక సమర్పించనుంది. గతంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే.