వ్యవసాయాన్ని పండుగ చేసేలా బడ్జెట్‌ | Andhra Pradesh Budget 2019 Meruga Nagarjuna Comments | Sakshi
Sakshi News home page

హామీల అమలును ప్రతిబింబించేలా బడ్జెట్‌ : మేరుగ

Jul 12 2019 6:10 PM | Updated on Jul 12 2019 6:21 PM

Andhra Pradesh Budget 2019 Meruga Nagarjuna Comments - Sakshi

సాక్షి, అమరావతి : వ్యవసాయం దండుగ అన్న ముఖ్యమంత్రి పాలించిన రాష్ట్రంలో వ్యవసాయం పండుగ అని నిరూపించేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉందన్నారు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌ ఆచరణాత్మకంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే బడ్జెట్‌ అన్నారు. విద్య, వైద్య, రైతు సంక్షేమానికి బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం :  జంగా కృష్ణమూర్తి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజారంజకంగా ఉందన్నారు ఎమ్మెల్సీ జంగా కృష్ణామూర్తి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను బడ్జెట్‌ ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. పారదర్శక పాలన, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. వెనకబడిన ప్రాంతాలపై బడ్జెట్‌లో ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement