హోదా పేరుతో చంద్రబాబు డ్రామా : ఆనం

సాక్షి, నెల్లూరు : ప్రత్యేక హోదా సంజీవని కాదని , హోదా కలిగిన రాష్ట్రాలు ఏం సాధించాయని గతంలో ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు నల్లదుస్తులతో ఢిల్లీలో హోదా కోసం డ్రామాలు ఆడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ప్యాకేజీతోనే ప్రయోజనమని చెప్పి కమీషన్ల కోసం కక్కుర్తిపడిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిరాహారదీక్ష చేస్తుంటే మోదీ అమరావతికి వస్తున్నారని దీక్షను భగ్నం చేశారన్నారు. అదే చంద్రబాబు ఇప్పుడు బుడబుక్కల జాతరలాగా ఢిల్లీలో హోదా పేరుతో హడావిడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి 29 సార్లు వెళ్లానని చెబుతున్న చంద్రబాబు రాష్ట్ర సమస్యలను మాత్రం ప్రస్తావించలేదు. హౌసింగ్ స్కీం పెద్ద స్కామ్ అనీ, ఇందులో మంత్రి నారయణ దళారీ కాగా, లోకేష్‌కు వాటాలు దక్కుతున్నాయని ఆనం ధ్వజమెత్తారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి