ఆ పత్రిక కథనాలతో మా పార్టీకి సంబంధం లేదు | ambati rambabu takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

ఆ పత్రిక కథనాలతో మా పార్టీకి సంబంధం లేదు

Oct 16 2014 1:42 PM | Updated on May 25 2018 7:29 PM

ఆ పత్రిక కథనాలతో మా పార్టీకి సంబంధం లేదు - Sakshi

ఆ పత్రిక కథనాలతో మా పార్టీకి సంబంధం లేదు

చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలు మాని బాధల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.

హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటాలు మాని బాధల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ చంద్రబాబు విలువైన సమయాన్నంతా సమీక్షలు, మీడియా ముందు ఉపన్యాసాలకే కేటాయిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని, ప్రధాని మోడీ ఫోన్ చేసేవరకూ చంద్రబాబు విశాఖ ఎందుకు వెళ్లలేదని అంబటి ప్రశ్నించారు.

హుదూద్ తుఫాను బాధితుల కోసం వైఎస్ఆర్ ఫౌండేషన్, సాక్షి సంయుక్తంగా ఏర్పాటు చేసిన నిధికి అందరూ విరాళాలు అందించాలని అంబటి కోరారు. వైఎస్ఆర్ సీపీని ఉద్దేశించి ఓ పత్రిక సంబంధం లేని కథనాలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. ఆ పత్రిక ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదన్నారు. ఆ పత్రికలో వచ్చిన కథనాలకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అంబటి స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement