పోలీసులుపై టీడీపీ నేతల రౌడీయిజం

Amaravati JAC Bandh Fails to Krisha, Guntur Districts - Sakshi

సాక్షి, గుంటూరు : మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేయవద్దన్నందుకు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులుపై టీడీపీ నేతలు రౌడీయిజం చేశారు. నిలువరించేందుకు యత్నించిన కానిస్టేబుళ్లపై సైతం దాడి చేశారు. (చదవండిబిల్లులపై మండలిలో రగడ)

కాగా అన్ని ప్రాంతాల అభివృద్ధిని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే రెండు జిల్లాల్లో ఎక్కడా బంద్‌ ప్రభావం కనబడటం లేదు. రాజధాని ప్రాంతంలోనూ టీడీపీ నేతల బంద్‌కు స్పందన కరువైంది. ఓ వైపు ఆర్టీసీ బస్సులు  యథావిధిగా తిరుగుతున్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక అసెంబ్లీ పరిసరాల్లో చొరబడిన అసాంఘిక శక్తుల కోసం సెర్చ్‌ కొనసాగుతోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. (చదవండిమండలిలో టీడీపీ సైంధవ పాత్ర)

అలాగే అమరావతి జేఏసీ ఇచ్చిన కృష్ణా, గుంటూరు జిల్లాల బంద్‌ పిలుపు ప్రభావం మచిలీపట్నంలో ఎక్కడా కనిపించడం లేదు. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ఇక నూజివీడు పట్టణంలోనూ బంద్‌ ప్రభావం ఏమాత్రం లేదు. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు యథావిధిగా తిరుగుతున్నాయి. స్థానిక జేఏసీ నేతలు తమకు అసలు బంద్‌ గురించి సమాచారమే లేదని చెబుతున్నారు. (చదవండిసీఎం జగన్‌కు రాజధాని రైతుల కృతజ్ఞతలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top