హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని జీహెచ్ఎంసీ కృష్ణబాబు తెలిపారు.
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జన కార్యక్రమం జోరుగా కొనసాగుతోందని జీహెచ్ఎంసీ కృష్ణబాబు తెలిపారు. ఈ ఏడాది 75వేలకు పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉందన్నారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన సమయంలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కృష్ణబాబు తెలిపారు.న హుస్సేన్ సాగర్తో పాటు నగరంలోని పలుచోట్ల నిమజ్జనం వేగవంతం చేసినట్లు చెప్పారు.
నిమజ్జనం అనంతరం ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు 2300 మంది కార్మికులను ఏర్పాటు చేసినట్లు కృష్ణబాబు తెలిపారు. ఆయన బుధవారం నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు. విగ్రహాల నిమజ్జనానికి 59 పెద్ద క్రేన్లు, 79 మొబైల్ క్రేన్లతో పాటు 85మంది గజ ఈతగాళ్లను నియమించినట్లు కృష్ణబాబు తెలిపారు.