► పేదలకు అండగా తుదికంటా పోరాడతాం
► ముదపాక రైతులకు అఖిలపక్షం హామీ
► కబ్జా అయిన భూముల సందర్శన
► అడ్డుకోవాలని ప్రయత్నించిన అధికార పార్టీ నేతలు
► రైతులను భయపెట్టినా ఫలితం శూన్యం
‘భూ బాధితుల పక్షానే ఉంటాం.. తుదికంటా వారికి అండగా నిలుస్తాం. అధికార పార్టీ కబ్జాల కోరల్లో చిక్కుకున్న భూములను రక్షించి.. తిరిగి రైతులపరం చేసేందుకు అవసరమైతే న్యాయపోరాటం కూడా చేస్తాం’.. అని అఖిలపక్ష నేతలు భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నేతల భూదందాలపై చేపట్టిన ఐక్య పోరాటంలో భాగంగా సోమవారం వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం పెందుర్తి మండలం ముదపాక సందర్శించింది. టీడీపీ నేతలు ఆక్రమించుకున్న 400కు పైగా ఎకరాల అసైన్డ్ భూములను పరిశీలించి.. బాధిత రైతులతో మాట్లాడింది.. ఆందోళన వద్దని.. అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
సాక్షి, విశాఖపట్నం : ప్రాణాలు పోయినా పోరాటం ఆపేది లేదని, కబ్జాల బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అఖిల పక్ష నేతలు స్పష్టం చేశారు. పెందుర్తి మండలం ముదపాకలో సోమవారం అఖిలపక్ష నేతలు పర్యటించి టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పరిశీలించారు. అధికార పార్టీ భూదోపిడీపై వారంతా మండిపడ్డారు. జిల్లాలో రూ.2 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణం జరిగిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లే కారకులని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జీవో 304ను రద్దు చేసేందుకు న్యాయస్థానంలో పోరాటం చేసే అవకాశాలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు, లోకేష్‌ల బినామీ అయిన రామరాజు అక్రమాలకు, విశాఖలో భూముల కుంభకోణాలకు వ్యతిరేకంగా అఖిలపక్షంతో కలిసి మహాధర్నా చేస్తామని ప్రకటించారు. భూ పోరాటం వీడితే ఏవో ప్రయోజనాలు కల్పిస్తామని వెంకటరాజు అనే వ్యక్తి నుంచి తనకు ఓ సందేశం వచ్చిందని వెల్లడించారు. ‘దళితులు, పేదల నుంచి అన్యాయంగా లాక్కున్న భూములను వారికి తిరిగి ఇచ్చేస్తే చాలని, అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూ కబ్జాదారులందరికీ జైలు తప్పదని, చంద్రబాబు, గంటా శ్రీనివాసరావు, పరుచూరి భాస్కరరావులు వెళ్లాల్సింది జైలుకని’ తాను వారికి బదులిచ్చానని చెప్పారు.
టీడీపీ నేతల అడ్డంకులు : అఖిలపక్ష బృందం క్షేత్ర స్ధాయి పరిశీలన గురించి తెలుసుకున్న టీడీపీ నేతలు రైతులను బృందం వద్దకు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందు రోజే పోలీసుల ద్వారా అందరినీ బెరించారు. భూముల పరిశీలనకు వచ్చిన బృందాన్ని ఘెరావ్ చేయాలని స్ధానిక టీడీపీ ఎంపీటీసీ రాంబాబు, సర్పంచ్ మల్లీశ్వరమ్మ భర్త రమణలు ప్రయత్నించారు. వారిని పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. మూడు కిలోమీటర్ల దూరం ర్యాలీగా వెళ్లిన నేతలు అక్కడ భూ కబ్జాదారులు అక్రమంగా నిర్మించిన రోడ్డును పరిశీలించారు. రైతులు తాము పండిస్తున్న జీడిమామిడి తోటలను నేతలకు చూపించారు. తరతరాలుగా తాము ఈ పంటపైనే ఆధారపడి బతుకుతున్నామని, ఇప్పుడు భూములను అక్రమంగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇతర పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులతోపాటు వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, అదీప్‌రాజు, తిప్పల నాగిరెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి, కోలా గురువులు, అక్కరమాని విజయనిర్మల, జాన్‌వెస్లీ, రవిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, కొండా రాజీవ్, పసుపులేటి ఉషాకిరణ్, శ్రీదేవివర్మ, జిల్లా అధికార ప్రతినిధి మూర్తి యాదవ్, పీలా వెంకటలక్ష్మి, సీపీఎం నేత గంగారామ్, తదితరులు పాల్గొన్నారు.
Breadcrumb
Related news
-
ఏయూను వదలని ‘ఎల్లో’ కుతంత్రం!
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎల్లో మీడియా బరితెగించేస్తోంది. అధికారులు, పోలీసులు, వలంటీర్లు.. ఇలా ప్రతి ఒక్కరినీ తప్పుపడుతూ సొంత తీర్పులిచ్చేస్తున్న ఎల్లో మీడియా ఇప్పుడు విశ్వవిద్యాలయాలను కూడా వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు. ప్రతిదానికి యాగీ చేయడం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేసేస్తున్నారని అసత్యాలు, అబద్ధాలు అచ్చేయడమే పనిగా పెట్టుకుంది. చివరకు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని కూడా ఎల్లో మీడియా తమ రాజకీయ ప్రయోజనాలకు రోడ్డుకు ఈడుస్తోంది. ఇదెలా తప్పు? ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుని ఉద్యోగాలు సాధించినవారికి శుక్రవారం వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయం సంకల్పించింది. అయితే ఇందులో కూడా ఎల్లో మీడియా తప్పులు వెతికింది. ఎచీవర్స్ డే పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అభూతకల్పనలతో ఈనాడు పత్రిక ఒక అశుద్ధ కథనం అచ్చేసింది. ఏయూ ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని.. తన కథనంలో రంకెలేసింది. దీంతో ఈనాడు పత్రిక దుర్బుద్ధికి భయపడిన అధికారులు అచీవర్స్ డేని రద్దు చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఏయూలో చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని ఆశించిన 2,287 మంది తీవ్రంగా నిరాశ చెందారు. కాగా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ మాత్రం ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదంటూ ఏప్రిల్ 24న అచీవర్స్ డే నిర్వహించడం గమనార్హం. అక్రమాల ‘గీతం’ కోసమే పన్నాగం.. ఈ ఏడాది ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో 802, ఇంజనీరింగ్‌లో 900, ఆర్ట్స్‌లో 410, బీఈడీలో 175కి పైగా ఉద్యోగాలు విద్యార్థులకు లభించాయి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును ఏయూ సొంతం చేసుకుంది. సైన్స్‌లో ఏకంగా 802 ఉద్యోగాలు రావడం ఇదే తొలిసారి. ఇంతటి ఘనమైన కీర్తిని సొంతం చేసుకున్న సమయంలో అచీవర్స్డేని తప్పుపడుతూ, దాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ ఈనాడు పత్రిక తన దుర్బుద్ధిని చాటుకుంది. విద్యార్థి విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా ఏటా ఏయూలో అచీవర్స్ డే నిర్వహిస్తున్నారు.వేదికపై విద్యాన్థితో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించి, వారికి విద్యార్థితో పాదాభివందనం చేయిస్తారు. ఏయూలో విద్యార్థులకు నియామక పత్రాలు అందించి, తల్లిదండ్రులను గౌరవించే ఈ కార్యక్రమాన్ని నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నిపుణుల బృందం సైతం ఇటీవల ప్రశంసించింది. అయితే దీన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకపోయింది. పేద కుటుంబాల పిల్లలకు లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు సాధించడంతో ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఏయూ ప్రతిష్ట పెరిగింది. దీంతో టీడీపీ నేత భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీకి, టీడీపీకి కంటగింపుగా ఏయూ మారింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ స్వయంగా గీతం డీమ్డ్ వర్సిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన వర్సిటీ ఉద్యోగులతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సిబ్బంది ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతి ఇచ్చి రద్దు చేశారు.. క్లాజ్ –22 ప్రకారం ఎన్నికల సమయంలోనైనా యూనివర్సిటీల పరిధిలో అపాయింట్మెంట్స్, రిక్రూట్మెంట్స్ ఆపడానికి వీల్లేదు. అందుకే.. 15 రోజుల ముందుగానే జాయింట్ కలెక్టర్ డా.మయూర్ అశోక్‌కు ఏయూ అధికారులు అచీవర్స్ డే కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ కూడా అనుమతులు మంజూరు చేశారు. అచీవర్స్ డే కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. అయితే ఈనాడు విషకథనంతో అధికారులు చివరి క్షణంలో అచీవర్స్ డేకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. నేనెలా ప్రభావితమవుతాను? నాకు 22 ఏళ్లు. పూర్తి పరిణితి చెందిన నేను సమావేశంలో ఒక వ్యక్తి చెప్పే ప్రసంగానికి ప్రభావితమై ఓటు వేస్తానని ఎలా అనుకుంటున్నారు? విద్యను రాజకీయంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదు. ఏటా అచీవర్స్ డేను నిర్వహిస్తుండగా ఈ ఏడాది అడ్డుకోవడం తప్పు. – ఒ.గోవర్ధన్, బయోటెక్నాలజీ విభాగంచాలా బాధగా ఉంది.. నేను నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చని చాలా సంతోషించాను. ఇప్పుడు అచీవర్స్‌డే రద్దు కావడం పట్ల చాలా బాధగా ఉంది. – ఎ.స్వాతి, స్టాటిస్టిక్స్ విభాగం -
తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు
సాగరమంటేనే జలనిధి...అపార మత్స్య సంపదకు పెన్నిధి... సాగర తీరాన వెలసిన రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సుసంపన్నతను సమకూర్చాయి..మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచాయి...వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపాయి..పరిశ్రమల స్థాపనకు పునాదులు వేశాయి...ఆయా రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలను మార్చేశాయి...ఈ ఆలోచనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విశాఖపట్నాన్ని పాలనారాజధానిగా చేయాలన్న గొప్ప సంకల్పానికి ప్రేరేపించింది...ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పడానికి విశాఖపట్నంలోని పోర్టు ఒక్కటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో కనిపిస్తోంది... దేశంలోనే సుదీర్ఘ తీరమున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందీ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకు చాలా అవకాశమున్నా ...పాలించడం చేతకాని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల వాటి ఏర్పాటు సాధ్యం కాలేదు...సీఎంగా జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈ రోజు నాలుగు పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు్ల రాష్ట్రానికి అపార సంపదనివ్వబోతున్నాయి...మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచబోతున్నాయి...మరెన్నో పరిశ్రమల స్థాపనకు ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు వేదికలు కాబోతున్నాయి... రాష్ట్ర పురోగమనానికి ఇలాంటి ఆలోచన ఉన్న నేతలు ఉంటేనే నలుచెరగులా ప్రగతి లంగరు వేస్తుంది... సీఎం జగన్ రూపంలో రాష్ట్రానికి బంగరు భవిష్యత్తు అద్దుకుంటోంది. – చంద్రశేఖర్ మైలవరపు, సాక్షి, అమరావతి పది ఫిషింగ్ హార్బర్లు...రాష్ట్రంలోని మత్స్యకారుల సుదీర్ఘ కల సాకారమవుతోంది. ఇంతకాలం వలస కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు అధునాతన మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మత్స్యకారులకు ప్రయోజనం కలి్పంచే విధంగా పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేవన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ మత్స్యకారులు వాపోయారు. తాను ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించే విధంగా ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హమీ మేరకు రూ.3,66.07 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్ హార్బర్లను, రూ.126.91 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. దేశాన్ని సుసంపన్నం చేయడంలో జలధి ప్రాధాన్యం ఎనలేనిదని చైనా, సింగపూర్ వంటి దేశాలు ఏనాడో గుర్తించాయి. ఈ సత్యాన్ని గుర్తించే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అత్యంత రద్డీ ఉండే ఓడరేవుగా సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా , టాప్ 15 పోర్టుల్లో 8కి పైగా పోర్టులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబైలు మెట్రోపాలిటన్ నగరాలుగా మారడంలో పోర్టులు కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలుగా సృష్టించుకునే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. 2019లో ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం ప్రచారం కోసం టెంకాయలు కొట్టి చేతులు దులిపేసుకున్నాడాయన. దీనికి భిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు... ప్రతీ 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లు, ఫిష్‌ల్యాండ్ సెంటర్లను జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. వీటికోసం సుమారు రూ.25,000 కోట్ల వ్యయం చేస్తుండటం అద్భుతం. రూ.3,736.14 కోట్ల వ్యయంతో రామాయపట్నం, రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం, రూ.4,361.91 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, పీపీపీ విధానంలో కాకినాడ సెజ్‌లో గేట్‌వే పోర్టును రూ.2,123.43 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేంద్ర కస్టమ్స్ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలి నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ, రవ్వ క్యాప్టివ్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని జగన్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం... వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ ఐదేళ్లలో తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది. 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగిందిపోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు... పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కమిటీని వేశారు.ఈ క్రమంలో తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా, దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరులో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఫిషింగ్ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్ యూనిట్లు... ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రగతి ఫలితంగా ప్రస్తుతం 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల సామర్థ్యం 300 మిలియన్ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోర్టుల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించనుండటంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. రామాయపట్నం సమీపానే ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టు.... రామాయపట్నం పోర్టు సమీపంలో ఇండోసోల్ రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్ ఉపకరణాల తయారీ యూనిట్ తొలి దశ పనులను పూర్తి చేసుకుని ఈ మధ్యే ఉత్పత్తిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫిషింగ్ హార్బరు లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలబెట్టుకోవచ్చు. –పైకం ఆంజనేయులు, ఫైబర్ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నంనిన్నటిదాకా కూలీలం... ఇకపై యజమానులవుతాం.రాష్ట్రంలో ఫిషింగ్ హార్బర్లు లేకపోవడంతో నెల్లూ రు, ప్రకాశం జిల్లా తీరప్రాంత మత్స్యకారులు ఇన్నాళ్లూ చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్ బోట్లు కొనుగోలు చేసుకుని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలి్పంచింది. ఫిషింగ్ హార్బరు, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా జువ్వలదిన్నె హార్బర్‌ను నిర్మిస్తున్నారు. – కొండూరు అనిల్ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ (ఆఫ్కాఫ్) మినీపోర్టు స్థాయిలో నిర్మాణం ఇప్పటి వరకు బోట్లు నిలపడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల ఆపేలా నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు...ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్ మండలాలకు చెందిన 50,000 మత్స్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. –ఎన్. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ రామాయపట్నం► ప్రాజెక్టు వ్యయంరూ.3,736.14 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 34.04 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం138.54 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీపనులు ప్రారంభించిన తేదీ జూన్ 24, 2022 కార్యకలాపాల ప్రారంభం జనవరి, 2024 మచిలీపట్నం ►ప్రాజెక్టు వ్యయం రూ.5,156 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం 35 ఎంఎంటీపీఏ►పూర్తిస్థాయి సామర్థ్యం 116 టన్నులు ►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 21, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 మూలపేట ►ప్రాజెక్టు వ్యయం : రూ.4,361.91 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం23.50 ఎంఎంటీపీఏ ►పూర్తిస్థాయి సామర్థ్యం: 83.30 టన్నులు ► తొలి దశలో బెర్తులు: నాలుగు రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం1,20,000డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్ 18, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 కాకినాడ గేట్ వే►ప్రాజెక్టు వ్యయం : రూ.2,123.43 కోట్లు ►తొలి దశలో పోర్టు సామర్థ్యం16 ఎంఎంటీపీఏ► తొలి దశలో బెర్తులు: నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి క్రాఫ్ట్ బెర్త్) ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 1,20,000 డీడబ్ల్యూటీ పనులు ప్రారంభించిన తేదీ నవంబర్ 20, 2021 కార్యకలాపాల ప్రారంభం నవంబర్, 2024 -
ఓటుకు కోట్లు కేసులో పారిపోయి వచ్చింది అందుకేగా: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాజకీయాల్లో నేతల తలలపై రూపాయి పెట్టి విలువ కట్టడమే నీ బతుకు.. ఓటుకు కోట్లు కేసులో పారిపోయి తిరుగుతున్న నీచుడు బాబు’’ అంటూ దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓటమి నీ కళ్ల ముందు కనిపిస్తుంటే.. నీ నోటికి అడ్డూఅదుపూ ఉండదా..?. విశాఖ రాజధానిగా సమర్ధించని నువ్వు ఉత్తరాంధ్రపై నంగనాచి కబుర్లా..?. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా జగన్ ఆలోచనలు ఉన్నాయి. ప్రజా నాయకుడు జగన్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడటం మర్యాద కాదు’’ అంటూ మంత్రి హితవు పలికారు.మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే.. ఓటమి తెలిసే.. చంద్రబాబులో అసహనంచంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన భాష, మాట్లాడే తీరును చూస్తే ప్రజలు అసహ్యించుకుంటున్నారు. రాజకీయం అనుభవశాలిగా చెప్పుకుంటూనే కంట్రోల్ తప్పి మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రిని పట్టుకుని నెత్తిమీద అర్ధరూపాయి పెడితే దమ్మిడీకి కొనరంటున్నాడు. స్పీకర్నైతే రకరకాల పేర్లతో పిలుస్తాడా..? అసలెందుకు అంత సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడు..? రాజకీయాల్లో ఎన్నికలు వస్తూపోతూ ఉంటాయి. నాయకులుగా గెలుస్తాం. ఓడతాం.. అయితే, తాను, తన కూటమి ఓడిపోబోతుందని తెలిసి అంత సహనం కోల్పోయి నోటికేదొస్తే అది మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా..? అతను ఏమనుకుంటున్నాడు.? ప్రజలు ఛీకొట్టే విధంగా మాట్లాడటానికి అతను సిగ్గుపడాలి. వెన్నుపోటు రాజకీయాల్లో నీకన్నా నీచుడెవడు..?నీచుడంటే ఎవరు..? పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అతని అధికారం లాక్కుని.. పార్టీని, పార్టీ జెండాను హస్తగతం చేసుకున్నోడు ఏమవుతాడు..? ఆ మామ తాలూకూ చావుకు కారణమైన వాడివి నువ్వు.. మరి, నిన్నేమని సంభోధించాలి..? నీచుడనాల్నా.. అంతకన్నా పెద్ద మాట ఇంకేమైనా ఉందా..? దీనికి చంద్రబాబే సమాధానం చెప్పాలి. ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు..రాజకీయ నేతల తలల మీద ఎంత పెట్టాలో.. ఏ రకంగా వాళ్లను కొనాలో.. బేరాలకు లొంగే నేతల గురించి కొలమానం నీకు తెలుసు. అంతమాత్రానా అందర్నీ వేలం పెడతానంటే ఎలా కుదురుతుంది..? మరి, నీకు అంత సామర్ధ్యం ఉండబట్టే కదా.. హైదరాబాద్ నుంచి ఇక్కడకు పారిపోయి వచ్చింది..? ఓటుకు కోట్లు కేసులో నువ్వు చేసింది ఇదేనని అందరికీ తెలుసుకదా..? అతెందుకు.. అసలు, నీ తల మీద ఉన్న విలువెంతో నీకు తెలుసా..? నువ్వొక చెల్లని కాసు అనేకదా.. నిన్ను 2019లో ప్రజలు ఓడించి మూలన కూర్చొబెట్టారు. అలాంటి నువ్వు.. ప్రజా మద్దతుతో రాష్ట్రంలో 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్‌రెడ్డి గారిని పట్టుకుని వేలం వేస్తానంటావా..? ఆ మాట అనడాని కి నీకు సిగ్గుగా అనిపించలేదా..? నీ మాట్లాడే తీరును, భాషను, సహనం కోల్పోయి ఏ విధంగా ప్రవర్తిస్తున్నావనేది ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. విశాఖ రాజధానిగా, ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధే మా ధ్యేయంఎస్.కోటలో నా గురించి మాట్లాడుతూ.. ఏం బొత్సా అని పిలిచావ్..? సరే, నాకంటే వయస్సులో పెద్దోడివనుకుంటా.. నువ్వు అలా నన్ను సంభోదించినా నేనేం అనుకోను. ఎస్.కోటను విశాఖపట్టణంలో కలపకుండా విజయనగరంలోనే ఎందుకు ఉంచావన్నావు. నీమాటకే వస్తే.. ఎస్.కోటను విశాఖలో కలపడం వలన ఏంటి లాభం..? సమాధానం చెప్పు..? మా ఉద్దేశంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసుకుని ఉత్తరాంధ్ర ప్రాంత 34 ప్రాంతాల్ని సమగ్ర అభివృద్ధిలోకి తేవడం మా అభిమతం. ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే హక్కు నీకెవరిచ్చారు...? మేం వారి అభిప్రాయాల్ని గౌరవిస్తాం కనుక ఉత్తరాంధ్రలో ఆయా ప్రాంతాల అభివృద్ధి ఎలా చేయాలనేది మాకు తెలుసు. విశాఖను రాజధానిగా నువ్వెందుకు సమర్ధించవు..?విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తాం.. దీన్ని దేశంలోనే అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దుతామని జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. నువ్వేమో.. ఇక్కడ రాజధాని ఉండటానికే వీల్లేదంటూ.. ఆ స్థాయి పట్టణంగా విశాఖ పెరగకూడదని నువ్వు అడ్డుపడుతున్నావు. విశాఖ రాజధానిగా నువ్వు సమర్ధించనప్పుడు ఎస్.కోట గురించి ఎందుకు మాట్లాడుతున్నావు..? ఒకవేళ, నువ్వు విశాఖపట్టణాన్ని రాజధానిగా సమర్ధిస్తే.. ఒక్క విశాఖ ఏంటి..? అనకాపల్లి, పార్వతిపురం, విజయనగరం, ఎస్.కోట, శ్రీకాకుళం తో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతోంది కదా..? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లొద్దుగతంలో విశాఖ జిల్లాలోనే ఉన్న అనకాపల్లిని జిల్లా చేశామంటే.. అదొక వెనుకబడిన ప్రాంతంగా ఉండాలని చేశామా..? పరిపాలనా సౌలభ్యం కోసమే ఆ ప్రాంత ప్రజలకూ అభివృద్ధి ఫలాలు శరవేగంగా దక్కాలని కాదా..? మరి, ఇవ్వన్నీ ఏం తెలియకుండా నీ లెక్కలేంటి..? నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నావా..? విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే ఉత్తరాంధ్ర ప్రాంత జిల్లాలన్నీ అభివృద్ధిలోకి రావడంతో పాటు విశాఖ ప్రపంచస్థాయి నగరం అవుతోందనేది అందరికీ తెలుసు. అలాంటిది, నువ్వేమో ఒక్క పక్కన కోర్టులకెళ్లి మరీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు మోకాలడ్డుతూ.. ఎన్నికలనగానే, ఇక్కడకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నంగనాచి కబుర్లు చెబుతావా..? ఉత్తరాంధ్ర ప్రజలు నువ్వు చెప్పే మాటల్ని నమ్మేంత అమాయకులేమీ కాదని తెలుసుకో.. అవినీతి చక్రవర్తి బిరుదాంకితుడు చంద్రబాబు:-చంద్రబాబు కాలేజీకి సైకిల్ మీదనే వెళ్లేవాడనేది ఆయన సన్నిహితులే గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. మరి, నేనైతే.. కాలేజీకి స్కూటర్ మీద వెళ్లాను. రెండెకరాలతో రాజకీయంలోకి వచ్చిన చంద్రబాబుకు ఇవాల్టికి రూ.1400 కోట్లు ఏ విధంగా వచ్చాయి..? అంతమొత్తం ఎలా సంపాదించాడు..? మరి, మేమూ 15 ఏళ్లపాటు అనేక ప్రభుత్వాల్లో మంత్రులుగా చేశాం కదా..? అన్ని కోట్లు రూపాయలు మాకెందుకు రాలేదు..? ఎన్ని కుంభకోణాలు చేసి అన్ని రూ.వేల కోట్లు సంపాదించావో ప్రజలకు సమాధానం చెప్పు. అవినీతి చక్రవర్తి అనే బిరుదును ప్రజలు నీకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకో.. ఇప్పటికైనా, నీ భాషను సరిచేసుకోకపోతే చాలా దెబ్బతింటావు. రాజకీయాల్లో సహనం కోల్పోయి మరీ అంతగా నోరుపారేసుకోవడం మంచిది కాదు. ప్రజలు నీ మాటలు విని అసహ్యించుకుంటున్నారు. ఉత్తరాంధ్ర నీ జాగీరేం కాదు..?ఉత్తరాంధ్ర ప్రాంత నేతలుగా మేము రాజకీయాల్లో ఎప్పట్నుంచో ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల తాలూకూ మనోభావాలు.. ఆత్మగౌరవం మాకు తెలుసు. అలాంటిది, ఈరోజు ఎన్నికలనగానే నువ్వొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం నీ జాగిరు అన్నట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది..? వయసులో పెద్దోడివైనప్పటికీ, కొంచెం వళ్లు దగ్గరబెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది. నోటికేదొస్తే అది మాట్లాడుతానంటే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు.పేద పిల్లలకు సీబీఎస్ఈ సిలబస్‌తో టోఫెల్ శిక్షణ:రాష్ట్రంలోనే కాకుండా.. దేశంలోని అనేకమంది ప్రజాస్వామ్యవాదులు, మేధావులు జగన్ విజయం గురించి మాట్లాడతున్నవన్నీ వాస్తవాలే కదా..? మరి, ఆయన గానీ మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే.. పేద పిల్లలకు నాణ్యమైన విద్య, ఆయా కుటుంబాలకు ఖరీదైన వైద్యం దూరం అవుతుంది కదా..? ఈ రాష్ట్రంలో మూడోతరగతి నుంచే పిల్లలకు టోఫెల్ పరీక్షకు తయారుచేసే విద్యావిధానంలో దేశంలో ఎక్కడైనా ఉందా..? విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఇంగ్లీషు భాషపై పట్టుతో మాట్లాడేందుకు టోఫెల్‌ను గతంలో నేర్చుకునేవాళ్లు. కానీ, మన పిల్లలకు మూడో తరగతి నుంచి టోఫెల్ నేర్పిస్తూ.. బేసిక్, జూనియర్, సీనియర్ అంటూ టెస్టులు పెట్టి ప్రభుత్వమే వాళ్లకు ఫీజులు కడుతూ ఇంగ్లీషు మీడియంను వృద్ధిలోకి తెస్తున్నాం. గతంలో సీబీఎస్ఈ సిలబస్‌తో నడిచే హైస్కూళ్లు రాష్ట్రంలో అన్ని కలిపితే 100 ఉండేవి కాదు. అలాంటిది, ఇవాళ వెయ్యికి పైగా సెంట్రల్ సిలబస్‌తో హైసూళ్లను అప్‌గ్రేడ్ చేశాం. ఇంగ్లీషు మీడియం పట్ల కొత్తగా మేం చైతన్యం తెచ్చాం. ఐబీ విద్యను రాష్ట్ర విద్యావిధానంలోకి తెస్తున్నాం. జెనీవాలోని సంస్థతో మాట్లాడి.. ఆ సంస్థ మేనేజ్మెంట్ను ఏపీకి రప్పించి.. జగన్మోహన్రెడ్డి గారి సమక్షంలో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నాం. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ఐబీ కొలబరేషన్తో ప్రభుత్వ స్కూళ్లల్లో సరికొత్త విద్యావిధానాన్ని నడిపించ నున్నాం. మరి, విద్యావ్యవస్థలో ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా చూశామా..? అదే ఐబీ చదువుకోవాలంటే, ట్యూషన్ ఫీజు ఒక్కో విద్యార్థికి ఆరేడు లక్షల రూపాయలు వెచ్చించాలి. అలాంటిది, ప్రభుత్వ స్కూళ్లల్లో ఉచితంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామంటే అది సంతోషమే కదా..? ఇది మా ప్రభుత్వం తాలూకూ నిబద్ధత. మా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారి ఆలోచన. అందుకే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్రెడ్డి గారే ఎందుకు అవసరమనేది చెబుతున్నాం.రాష్ట్రంలో ముందెన్నడూ లేనివిధంగా ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి. కాలేజీకి వంద సీట్ల చొప్పున తీసుకుంటే.. ఈ రాష్ట్ర విద్యార్థులకు 1700 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నట్లే కదా..? అందులో 70 శాతం పేద విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. రూ. కోటి నుంచి రూ.2 కోట్లు ఖర్చుపెట్టి సీట్లు పొందలేని విద్యార్థులకు ఉచితంగా మెడికల్ సీట్లు వస్తున్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఒక సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి వస్తుంది. ఆ ఊరి పేదవాడికి ఖరీదైన నాణ్యమైన వైద్యం ఉచితంగానే అందుతోంది. నీ విజన్‌తో పేదోడికి మేలు జరిగిందా బాబూ..?ఇవన్నీ ప్రభుత్వం చేస్తోన్న కార్యక్రమాలే కదా..? వీటిని చెప్పకుండా నోటికేదొస్తే అది మాట్లాడటం.. అభివృద్ధి లేదని అదేపనిగా ఊదరగొడితే ఎలా కుదురుతుంది..? ప్రజలకు ఇవ్వన్నీ తెలిసిన వాస్తవాలని మీరు మరిస్తే ఎలా..? చంద్రబాబు పాలనలో ప్రజలకు మేలు చేసే ఇలాంటి మంచి ఆలోచనలు ఎప్పుడైనా చేశాడా..? అంటే, నీ విజన్‌లో పేదోడికి ఏనాడైనా మేలు జరిగిందా..? జగన్ గెలుపు అనివార్యమంటోన్న మేధావులు:అనేకరంగాల్లో మేధావులైన వారు సైతం ఇవాళ జగన్ గారి పరిపాలనా సంస్కరణలను మెచ్చుకుంటున్నారు. ఆయన ఎన్నిక అనేది ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం కాదు. ఈ రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి కోసం. ఆయా కుటుంబాల్లోని పేద పిల్లల చదువులు అంతర్జాతీయ స్థాయిలో పెరగాలంటే .. అది రాబోయేకాలంలో దేశానికి, రాష్ట్రానికి పెట్టుబడిగా ఉండాలనేది జగన్ గారి తాపత్రయం. అందుకే, విద్య, వైద్యం, వ్యవసాయంలో అనేక సంస్కరణలు చేపట్టారని పెద్దలు ఉదాహరణలుతో సహా వివరించడం చాలా బాగుంది. ఒకవేళ, జగన్ గారే కనుక గెలవకపోతే.. ఇప్పటిదాకా రాష్ట్రంలో విద్యావైద్యంలో కొనసాగిన సంస్కరణలు ఆగిపోయే ప్రమాదం ఉందని మేధావులే చెబుతున్నారు. అవి ఆగిపోతే, ఈ రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి పేద కుటుంబాల ప్రజలు ప్రమాదంలో పడిపోతారని చెబుతున్నారు.ఇదీ చదవండి: జైత్రయాత్రను తలపించిన సీఎం జగన్ బస్సుయాత్ర -
విశాఖపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
విశాఖపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు -
మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలన్న: YSRCP సోషల్ మీడియా వింగ్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 21వ రోజు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో ప్రభంజనంలా కొనసాగుతోంది. దారిపొడవునా సీఎం జగన్‌కు ప్రజలకు బ్రహరథం పడుతున్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. విశాఖపట్నం పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెషన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో రెండు వేల మందితో కూడిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్‌తో సీఎం సంభాషించారు. పలువురు YSRCP సోషల్ మీడియా కార్యకర్తలు తమ మనోగతాన్ని సీఎం జగన్‌తో పంచుకున్నారు. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది ‘నా తమ్ముడు భరత్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి నెలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగివస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడుకు మీరే దైవం అన్న. మీరు బాగుంటేనే మేము బాగుంటాం. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ఎల్లోమీడియా ఎంతో దుష్ప్రచారం చేసేది. అయితే భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంతగా స్ట్రాంగ్ అయ్యింది. మా తమ్ముడు చనిపోయినా బాధగా ఉన్నాకూడా మీతో ఒక్కసారి ఫోటో దిగానా, మిమ్మల్ని కలుసుకున్నా వాడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బ్రతికినా చాలు.. మీకు మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది’ -ఎం. అనిల్ కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం జగనన్న మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనస్సుకు ఎంతగాయమైనా, దేహానికి ఎంతగాయమైనా చిరునవ్వుతో బతకాలని అన్నది మిమ్మల్ని చూసి ఇన్పైర్ అయ్యాము. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు అయితే ఇంకా అండాదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను సార్.. -బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త) బాల చంద్ర వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందిస్తూ.. ‘బాలచంద్ర.. నీ కుటుంబానికి 100 శాతం అన్నిరకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం ఇప్పటికే జరుగుతోంది. ఇది ఎప్పటికీ మనస్సులో పెట్టుకో. సజ్జల భార్గవ్‌కు కూడా చాలా క్లియర్‌గా చెప్పాను. అన్నిరకాలుగా నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తాడు’ అని భరోసా ఇచ్చారు చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్‌గా రాడు ‘అన్న ఒక చిన్న విషయం చెప్తాను. తెనాలిలో ఇళ్ల పట్టా తీసుకుని గీతాంజలి చాలా సంతోషంతో చెప్పలేని ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కానీ మీరు చెప్పినట్టు.. కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు. తెలుగుదేశం పార్టీ ముళ్లున్న చెట్టు. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతో అండగా నిలిచింది. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్టు భావించాం. అన్నా మీరు చాలా జాగ్రత్త.. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్‌గా రాడు, వారి వెన్నుపోటుకు జాగ్రత్తగా ఉండమని చేతులెత్తి దండమెడుతున్నా. -పి. నాని, బాపట్ల జిల్లా 2014 నుంచి 2019 వరకు ముస్లింలంతా భయపడుతూ బ్రతికారు. 2019లో మా రాజన్న బిడ్డ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలర్ ఎగరేసుకుని బ్రతుకుతున్నాం. మైనార్టీలను నలుగురిని ఎమ్మెల్యేలు చేశారు, ఎమ్మెల్సీలను చేశారు, డిప్యూటీ సీఎంను చేశారు, మండలి వైస్ ఛైర్మన్‌ను చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఏడుగురికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు, అదీగాక హఫీజ్ ఖాన్ కు రాజ్యసభ అనౌన్స్ చేశారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. వాళ్లు మూడు జెండాలతో వస్తున్నారు మనది ఒకటే జెండా కానీ ఆ జెండాకు మూడక్షరాలు Y.S.R అదిచాలన్నా ఆ జెండాను మోసేందుకు.. -వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని.. నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయా ‘విశాఖ ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టుకు సంబంధించి అంతా టీడీపీ వాళ్లు అని తెలియక అక్కడ ఉద్యోగంలో చేరాను నేను. కోడికత్తి శ్రీను విశాఖలో మీమీద దాడి చేసిన ఘటనకు ప్రత్యక్ష సాక్షిని నేను. ఆ ఘటన తర్వాత నేను జగన్ అభిమానిని అని తెలిసి వాళ్లు నన్ను చాలా వేధించారు. అక్కడ టీడీపీ నాయకులు లోకేష్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్‌వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా అక్కడ ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నేను PCS రూల్ ప్రకారమే ఉండాలని ప్రయత్నించేదాన్ని. మీ అభిమానిని అన్న కారణంగా నన్ను అనుమానించి, నాపై దొంగకేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని కూడా ఎంతగానో హింసించారు. వేణుగోపాల్ అయితే నిన్ను ఎక్కడా బతకనివ్వను అని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నేనే చేయించినట్టు చెప్పాలంటూ నా మీద ఒత్తిడి తెచ్చారు. దీంతో నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. కుటుంబం అంతా కూడా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ నేను ఉద్యోగం కూడా లేకుండానే ఉన్నాను. కానీ మొన్న విజయవాడలో మీ మీద బోండా ఉమ చేయించిన దాడి చూశాక మౌనంగా ఉండకూడదు అనుకున్నాను. ఈ విషయాన్ని ఇప్పుడు మీ ముందే బయటపెడుతున్నాను. దొంగ కేసు పెట్టి నా కెరీర్ నాశనం చేసారు. అయినా నేను బాధపడలేదు. నా ఉద్యోగం అయితే తీయగలిగారు కానీ నా గుండెల్లోంచి జగనన్నను తీయలేకపోయారు. -సామ్రాజ్యం, గతంలో ప్రేవేట్ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్‌పోర్టు సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాపరంగా ఎవరైనా హెరాస్మెంట్కి లోనైతే సహాయం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎవరైనా సోషల్ మీడియా వల్ల ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారుచేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. అవతలి వాళ్లు మన మీద దాడి చేస్తున్నారు అంటే, సుచిత్ర కానీ, గీతాంజలి కానీ, సాక్షాత్తూ నామీద కానీ, దాని అర్థం ఏమిటంటే.. మనం విజయానికి చేరువగా ఉన్నామని...విజయానికి వాళ్లు దూరంగా ఉన్నారని. మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా కుటుంబం గురించి అయినా మర్చిపోతామేమో కానీ మీ గురించి మర్చిపోయి ఒక్కరోజు కూడా లేము. మా కుటుంబం కంటే ఎక్కువ అయ్యారు మీరు. ఎందుకంటే మీరు ఎంతో గొప్ప ఇన్స్పిరేషన్ మాకు. అబ్రహాం లింకన్, మహాత్మాగాంధి, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం కానీ మీరు మాకు కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. 36 ఏళ్ల వయసులో మీరు ఢిల్లీ పీఠాన్ని ఎదిరించారు. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పే మాటలు మాకెంతో ఇన్సిపిరేషన్ ఇస్తాయి. యువతను ఉత్తేజపరుస్తాయి. మీకోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం. -హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ *కడుపు కాలేవాడికే మీ పథకాల విలువ తెలుస్తుంది. మా అన్నయ్య మన పార్టీ వీరాభిమాని, సోషల్ మీడియా సైనికుడు. 2022లో యాక్సిడెంట్లో మరణించాడు. అది తెల్సుకుని ముందుగా సజ్జల భార్గవ్ గారు స్పందించారు. మా ఇంటికి వచ్చారు. మీ గురించి జగనన్నకు కూడా తెలియజేసామని, మీకు సాయం అందించమని ఆదేశించారని కూడా చెప్పారు. మా కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి రెండు నెలల్లోనే మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. అంతే కాదు మా సొంత పిన్నీ, బాబాయ్ టీడీపీ అభిమానులు, అంతేకాదు గత టీడీపీ ప్రభుత్వంలో వాళ్లే జన్మభూమి కమిటీలో మెంబర్లు కూడా. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలోనే ఇచ్చారు. సంక్షేమ పథకాలు మాకు, వాళ్లకూ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాళ్లింట్లో ఆడవాళ్లంతా కూడా జగనన్నకే ఓటు వేస్తాం అని చెబుతున్నారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. ఆ పెత్తందారులు మాకు గాయం చేస్తే మీరు మాకు సాయం చేస్తున్నారు. మా చివరి శ్వాస వరకూ జై జగన్ అనే అంటాం. ఫ్యాన్‌కే ఓటేస్తాం. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా మాకు కుటుంబమే అన్నా.. మా అన్న చనిపోయినప్పుడు ఓ కూలీ చేసుకునే వ్యక్తి ఫోన్ చేసి నేను ఇవాళ కూలి పనికి వెళ్తున్నా, కూలీగా వచ్చిన రూ.600 నీకు పంపుతా తమ్ముడూ అని చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా...నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. -వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా
Related News by category
-
ఆ కుటుంబ నైజం.. కస్సుబుస్సు
వృత్తి: ట్రాన్స్‌పోర్టు బిజినెస్ప్రవృత్తి: హత్యా రాజకీయాలు.. నేరాలు.. ఘోరాలుపదవి: ఉమ్మడి అనంతపురం జిల్లాలో కీలక దేశం నేతఅరాచకాలు,కేసులు: చెప్పలేనన్నిఅతనో నియంత.. అతనికెదురెళ్తే టిప్పర్ లారీకి ఎదురెళ్లినట్లే.. తన దురన్యాయాలను ఎవరైనా ప్రశ్నిస్తే ఆ రోజుతో వారికి భూమ్మీద నూకలు చెల్లినట్లే.. ఊళ్లలో ఫ్యాక్షన్ మంటలను ఎగదోసి, వాటితో చలికాచుకునే దుర్మార్గ రాజకీయం తన సొంతం.. అదే తన హాబీ కూడా.. రౌడీషీట్ తెరిపించుకున్న ఘనత ఆయన సొంతం. ఆయన తనయుడూ తక్కువేమీ తినలేదు. ప్రస్తుతం ఇతను ‘దేశం’ తరఫున పోటీ చేస్తున్నారు. సాక్షి, టాస్‌్కఫోర్స్ : ట్రావెల్స్ ద్వారా కండిషన్ లేని బస్సులను నడిపి ఆ ‘దేశం’ నేత ప్రయాణికుల జీవితాలతో చెలగాటమాడారు. 2013 అక్టోబరు 30వ తేదీన మహబూబ్‌నగర్ సమీపంలో పాలెం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 45 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ సీనియర్ నేత భార్యను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ లీజు అగ్రిమెంట్లు సృష్టించారని ఆ నేతపై సీఐడీ అభియోగాలను మోపింది.2017లో విజయవాడ వద్ద ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. కాంట్రాక్ట్ క్యారేజ్ పేరుతో పర్మిట్లు తీసుకుని స్టేట్ క్యారేజ్‌గా బస్సులు నడపడంపై అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. తప్పు చేసింది కాకుండా తన మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ నేత హైదరాబాద్ ఆర్టీఓ కార్యాలయాన్ని తన అనుచరులతో కలిసి ముట్టడించే ప్రయత్నం చేశారు. అక్రమాలకు పరాకాష్టగా బీఎస్ 3 వాహనాలు ఆ నేత అక్రమాలకు పరాకాష్టగా బీఎస్–3 వాహనాల కుంభకోణం నిలిచింది. ఓ ప్రముఖ సంస్థ వద్ద స్క్రాప్ ద్వారా కొనుగోలు చేసిన 154 బీఎస్–3 లారీలను బీఎస్–4 వాహనాలుగా నకిలీ ఎన్ఓసీ, ఇన్సూరెన్స్‌తో నాగాలాండ్‌లో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో లబ్ధి పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐ,ఈడీ దాడులు చేశాయి. 2020లో ఆ నేతతో పాటు ఆయన కుమారుడు, అనుచరుడు, మరికొందరిపై వివిధ పోలీసు స్టేషన్లలో 24 కేసులు నమోదయ్యాయి. బస్సులను సీజ్ చేయడంతోపాటు ఈ నేత, బినామీల పేరుపై ఉన్న రూ.22 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసి, పలు రికార్డులు స్వా«దీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసింది. ప్రభుత్వ నిధులూ స్వాహా...?తాడిపత్రి ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వ నిధులను పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. 2015æలో యాడికి మండలంలో గ్రామీణ సడక్ యోజన కింద రూ.2.40 కోట్లతో చేపట్టిన రోడ్డు పనులను కమీషన్ల కక్కుర్తితో నాసిరకంగా పూర్తి చేయించారు. రాయలచెరువులో నీరు–చెట్టు కింద పూడికతీత పనుల్లో రూ.2.5 కోట్లు దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.పెద్దవడుగూరు మండలంలో 2015లో రూ.6.45 కోట్లతో నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో ఎక్కువ శాతం చేయకుండానే పూర్తయినట్లు రికార్డుల్లో చూపించి నిధులు బొక్కేశారు. పెద్దవడుగూరు మండలంలోని పెద్ద వంక వద్ద జంగిల్ క్లియరెన్స్ పేరుతో దాదాపు రూ.8 లక్షలు కాజేశారు. చిన్నవడుగూరులో కుంట, కాలువల్లో ముళ్ల పొదల తొలగింపునకు దాదాపు రూ.18 లక్షలు, పెద్దవంకలో రూ.7 లక్షలను పనులు చేయకుండానే పక్కదారి పట్టించారు. కేసుల వివరాల► ఇప్పటికే రౌడీ షీట్ నమోదై ఉంది. ► 1996లో జరిగిన టౌన్‌బ్యాంకు ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో టీడీపీకి చెందిన లక్ష్మీనారాయణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆయన నిందితునిగా ఉన్నారు. ► మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 70కి పైగా కేసులు ఉన్నాయి. 1996 నుంచి 2024 వరకు తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో 57 కేసులు, తాడిపత్రి అప్‌గ్రేడ్ రూరల్ పోలీసు స్టేషన్లో 5, పెద్దపప్పూరు పోలీసు స్టేషన్లో 6, యాడికిలో ఒక కేసు నమోదయ్యాయి. ► 2020లో నకిలీ ఇన్సూరెన్స్ కుంభకోణంలో తాడిపత్రి పట్ట ణ, అప్‌గ్రేడ్ రూరల్ పోలీసు స్టేషన్లలో 28 చీటింగ్ కేసుల నమోదు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించడంతో ఆయనపై పోలీసులు ఒకేసారి 28 కేసులు నమోదు చేశారు. (1). ఎఫ్ఐఆర్ నెం. 28/2020. ఐపీసీ 420, 467, 468, 471, 472, 120(బి), 201 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లు. (2) ఎఫ్ఐఆర్ : 85/2020. ఐపీసీ 420, 467, 468, 471, 120–బి రెడ్‌విత్ 34 ఐపీసీ, 179, 182, 190 ఎం.వి.యాక్టు) మరో 27 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ► 2023లో పెద్దపప్పూరులోని ఇసుక రీచ్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ అనుచరులతో కలిసి వెళ్లిన ఆయన అక్కడున్న టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులుని కులం పేరుతో దూషించిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ► 1996 నుంచి 1999 వరకు జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన నిందితునిగా ఉన్నాడు. పీడీ యాక్ట్ ద్వారా పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్లో 2014లో ఎఫ్ఐఆర్ నెం. 142/14, సెక్షన్ 151 సీఆర్పీసీ కింద పీడీ యాక్టు నమోదైంది. అసెంబ్లీ పోటీలో ఉన్న తనయుడిపై కేసులు : ► ఆయన తనయుడిపై 30 కేసులు నమోదయ్యాయి. నకిలీ పత్రాలను సృష్టించి వాహనాలను విక్రయాలు జరిపిన నేరంపై 2022లో ఐపీసీ 420, 467,468,471,120బి రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో తండ్రీకొడుకులు కడప సెంట్రల్ జైలులో 50 రోజులు జ్యూడిíÙయల్ రిమాండ్‌లో ఉన్నారు. ► బీఎస్–3 వాహనాల కుంభకోణంలో బైయిల్‌పై వస్తూ తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద సీఐ దేవేంద్ర కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించినందుకు తండ్రితోపాటు తనయుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదైంది. మనీ ల్యాండరింగ్‌పై తాడిపత్రిలోని నివాసంలో ఈడీ అధికారులు దాడులు జరిపి ఆయన తనయుడిపై రెండు కేసులు నమోదు చేశారు. ఇంకా వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేసిన పలు కేసుల్లో తనయుడిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసులూ నమోదయ్యాయి. డబ్బు కోసం దేనికైనా సై ► తాడిపత్రి మండలం హుస్సేన్‌పురం వద్ద రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేసిన గెర్దావ్ స్టీల్ ప్లాంట్‌పై కన్నేసిన ఆ నేత కంపెనీ యజమానులను బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సొంతంగా ట్రాన్స్‌పోర్టును ఏర్పాటు చేసి, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు తన లారీలనే వినియోగించుకునేలా వారిపై ఒత్తిడి చేశారు. సరుకు రవాణాకు సంబంధించి ట్రాన్స్‌పోర్టు వే బిల్లులు కాకుండా తాడిపత్రి లారీ అసోసియేషన్ ద్వారా చేయించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొట్టారు. బినామీ లెక్కలతో రూ.300 కోట్లకు పైగా అక్రమంగా ఆర్జించినట్లు ఆరోపణలున్నాయి. ► స్టీల్ ప్లాంట్‌లో డ్రైస్లాగ్ ద్వారా నెలకు దాదాపు రూ.15 కోట్ల చొప్పున ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో రూ.900 కోట్లు ఆర్జించారని సమాచారం. ► గుత్తి నుంచి తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద ఉన్న వైఎస్సార్ జిల్లా సరిహద్దు వరకూ 63 కి.మీ. హైవే పనులకు రూ.275 కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ హైవే అధికారులు ఆహా్వనించిన టెండర్లను నాటి టీడీపీ ఎంపీకి చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు మరో విదేశీ కంపెనీ 13 శాతం తక్కువకు కోట్ చేసి దక్కించుకున్నాయి. విదేశీ కంపెనీకి మన దేశంలో అనుమతుల్లేవంటూ అధికారులను బెదిరించి ఆ టెండర్‌ను రద్దు చేయించారు. అనంతరం ఎంపీకి చెందిన కంపెనీతోపాటు మరో కంపెనీతో కలసి 4.9 శాతం ఎక్కువకు టెండర్ కోట్ చేయించి దక్కించుకున్నారు. ఈ అక్రమాలతో రూ.50 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ► మున్సిపాలిటీ ఆ«దీనంలోని కాంప్లెక్స్‌లోని మొదటి అంతస్తును తన ముఖ్య అనుచరుడు ఏడాదికి రూ.7.36 లక్షలు అద్దె చెల్లించేలా ఆ నేత లీజుకు ఇచ్చి, గుడ్‌విల్ రూపంలోనే దాదాపు రూ.2.66 కోట్లు పక్కదారి పట్టించారన్న ఆరోపణలున్నాయి. ► ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న కాంప్లెక్స్‌లో 6, 67, 68, 72 రూములను తక్కువ మొత్తంతో అద్దెకు తీసుకుని సబ్ లీజులకు ఇచ్చి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నట్లు సమాచారం. ► పెద్దపప్పూరు మండలం జూటూరు భూముల్లో ఆయన అనుచరులు రూ. కోట్ల విలువైన ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. పెన్నా, చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణాలోనే వారి అనుచరులు రూ.40 కోట్లకు పైగా కూడబెట్టారు. ► తమ కుటుంబ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని గనుల్లో లైమ్‌స్టోన్ వెలికి తీసే క్రమంలో చారిత్రక గుహలు వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ►మట్కా డాన్‌గా పేరున్న ఓ వ్యక్తికి ఈ నేత పూర్తి అండదండలు ఉండేవి. అప్పట్లో కడప విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్న సీఐ, తన సిబ్బందితో కలసి మట్కా డాన్ ఇంట్లో తనిఖీలు నిర్వహించినప్పుడు తన అనుచరులను ఉసిగొల్పి పోలీసులపై దాడులు చేయించి, పోలీసు వాహనాలకు నిప్పంటించారు. -
నవతరం కదలాలి.. పోలింగ్ పెరగాలి...
యువతరమే ముందు యుగం దూతలు..పావన నవజీవన, బృందావన నిర్మాతలు... అని శ్రీశ్రీ ఒక పాటలో అభివర్మించారు.. వారు తల్చుకుంటే సమాజాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లగలరని కొనియాడారు. అది నూరు శాతం వాస్తవం. ముఖ్యంగా ఎన్నికల్లో వారి పాత్ర కీలకం... యువత ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి రావాలే కానీ రాజకీయ తీరుతెన్నులే మారిపోతాయి. సంక్షేమానికి పట్టం కడుతున్నదెవరో, ఓట్ల కోసం మేనిఫెస్టోలనే బుట్టదాఖలు చేస్తున్నదెవరో యువత ఇట్టే గ్రహిస్తుంది.అణగారిన వర్గాలను ఉన్నత స్థానానికి తీసుకువెళ్లాలనే తపన పడేదెవరో– ఆ వర్గాల వంచకులెవరో గుర్తించే శక్తియుక్తులు వారికే ఉన్నాయి...దేశంలో ఈ సారి తొలిసారిగా ఓటుహక్కు వినియోగించుకోబోతున్న యువత 1.85 కోట్ల మంది. ఆంధ్రప్రదేశ్నే తీసుకుంటే మొత్తం ఓటర్లలో 20 శాతం 30 ఏళ్లలోపు యువతే ఉంది...ఎన్నికల సంఘం ఈ యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించే దిశగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలను యువ ఓటర్లు దిశా నిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా 96.88 కోట్ల మంది ఓటర్లు ఉండగా, అందులో 30 ఏళ్లలోపు ఓటర్ల సంఖ్య 20 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందులో 18 నుంచి 19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారి సంఖ్య 1.85 కోట్లు. దీంతో ఈ సారి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను ఆకర్షించే దిశగా అడుగులు ముందుకేస్తున్నాయి. మన రాష్ట్ర విషయానికి వస్తే మొత్తం 4.10 కోట్ల ఓటర్లలో సుమారు 20 శాతం మంది 30 ఏళ్లలోపే ఉన్నారు.18 నుంచి 30 ఏళ్లలోపు మొత్తం 79.03 లక్షల మంది ఉంటే అందులో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 18–19 ఏళ్ల వారు 8.25 లక్షల మంది ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వీరంతా విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలియచేసే విధంగా సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పారి్టసిపేషన్ (స్వీప్) పేరిట కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సెలబ్రెటీలతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వయోవృద్ధులకు ఇంటి వద్దే.. రాష్ట్రంలో తొలిసారిగా 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు పోలింగ్ బూతులకు రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేమనుకున్న వారు ముందుగా నమోదు చేసుకుంటే అధికారులు ఇంటి వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తారు. రాష్ట్రంలో 2.12 లక్షల మంది ఓటర్లు 85 ఏళ్లు దాటిన వారు ఉన్నారని, వీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘ అధికారులు వెల్లడిస్తున్నారు.దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 5.17లక్షల దివ్యాంగ ఓటర్లు ఉండటంతో వారు ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 79.77 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఇప్పుడు ఈ మొత్తాన్ని 83 శాతం దాటించాలని కేంద్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా నిర్దేశించుకుంది. -
ఓటు.. హక్కు మాత్రమే కాదు.. బాధ్యత
గుంటూరు వెస్ట్: యువ ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరు ఓటు వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా కోరారు. ఓటు హక్కు మాత్రమే కాదని అంతకు మించిన బాధ్యతగా భావించాలని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం లెట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థతో కలసి శనివారం గుంటూరు ఎన్టీఆర్ స్టేడియంలో యువ ఓటర్ల కోసం 3కే వాక్ నిర్వహించాయి. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ 18–19 ఏళ్ల మధ్య ఉన్న అర్హులైన యువత రాష్ట్రంలో 10.30 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇది శుభపరిణామమన్నారు. వీరంతా ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఓటింగ్ శాతం 79 అని తెలిపారు. దీన్ని 82 శాతానికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నట్లు చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ కొన్నిచోట్ల తక్కువగా ఉందన్నారు. పరిశ్రమల యజమానులతోపాటు వ్యాపారసంస్థలను సంప్రదిస్తున్నామని, ఆ రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని, జీతం మాత్రం కట్ చేయవద్దని చెబుతున్నామని వివరించారు. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నామన్నారు. లెట్స్ ఓట్ స్వచ్ఛంద సంస్థ తీసుకున్న చొరవ చాలా గొప్పదని ప్రశంసించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు మే 13వ తేదీ ఓటు వేసేందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం మీనా, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్పీ తుషార్ డూడీ, జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి, తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్, లెట్స్ ఓట్ సంస్థ కన్వీనర్ మాలకొండయ్య జెండా ఊపి 3కే వాక్‌ను ప్రారంభించారు. ఆర్డీవో పి.శ్రీకర్, డీఆర్వో పెద్ది రోజా, లెట్స్ ఓట్ సంస్థ గుంటూరు చాప్టర్ కోఆరి్డనేటర్ టి.బాలాజీశ్రీనివాస్ పాల్గొన్నారు. -
వైద్యం.. సువర్ణాధ్యాయం
నాడు..ప్రజారోగ్య పరిరక్షణ ధర్మాన్ని గత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని విస్మరించింది. దివంగత సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అంపశయ్యపైకి ఎక్కించింది. ఈ క్రమంలో ఏదైనా జబ్బు చేస్తే అప్పులు చేయాలి, అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోవాలి. ఆస్తులు లేని వాళ్లు దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీయాలి.రాష్ట్ర విభజనను బూచిగా చూపి 2014–19 మధ్య ఆర్థిక పరిస్థితులు బాగోలేవంటూ ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయలేమని చేతులు ఎత్తేశారు. 108, 104 వ్యవస్థకు పాతరేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల తాకిడికి అనుగుణంగా పోస్టుల భర్తీ చేపట్టలేదు. వసతులు కల్పించలేదు. అత్యవసర మందులు సైతం అందుబాటులో ఉంచలేదు. పారాసెటిమాల్ టాబ్లెట్ కావాలన్నా బయట తెచ్చుకోండని చీటీ రాసిచ్చే దుస్థితి. చిన్న పిల్లలను ఎలుకలు కొరికేసే పరిస్థితి. అయినప్పటికీ ఆ అధ్వాన్న పరిస్థితులే అద్భుతం అంటూ రామోజీ, ఎల్లో మీడియా బాబును ఆకాశానికి ఎత్తాయి. నేడు.. ఈ అధ్వాన్న పరిస్థితులను చక్కబెడుతూ ఈ ఐదేళ్ల పాలనలో నాడు–నేడు ద్వారా సీఎం వైఎస్ జగన్ వైద్య రంగాన్ని బలోపేతం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర మానవ వనరుల కొరతకు ప్రణాళికా బద్ధంగా చెక్ పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదారు. పేదలు దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు బారిన పడితే వారి చికిత్సల బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునే గొప్ప వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా తినేసింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినింది. అయినప్పటికీ ప్రజారోగ్యం విషయంలో వైఎస్ జగన్ ఏ మాత్రం రాజీ పడలేదు. మన ఇంట్లో వాళ్లకు ఎవరికైనా జబ్బు చేస్తే ఎలాంటి వైద్యం ఆశిస్తామో.. ఆ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్యం అందించాలనే తాపత్రయంతో ‘ఫ్యామిలీ డాక్టర్’ కాన్సెప్‌్టకు శ్రీకారం చుట్టారు. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం సాధ్యం కాని ఈ విధానం ఏపీలో దిగి్వజయంగా అమలవుతుండటం పట్ల ప్రముఖుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఉంటారో లేదో? తమ జబ్బు నయమవుతుందా? అని ఒకప్పుడు సామాన్యుడు సర్కారు దవాఖానా అంటే ముఖం చాటేసేవాడు. ఆ దుస్థితి నుంచి ప్రభుత్వ వైద్యులే ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించే స్థాయికి నేడు వైద్య రంగం అభివృద్ధి చెందింది. నాడు–నేడు వంటి విప్లవాత్మక కార్యక్రమం, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి వినూత్న విధానాలు పేదోడి వైద్యానికి ఊపిరిపోశాయి.ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ఈ ఐదేళ్ల వ్యవధిలో పేద, మధ్య తరగతికి కావాల్సింది జగన్ చేసి చూపించారు. 17 మెడికల్ కళాశాలల ఏర్పాటు చేసి పేద, మధ్య తరగతికి వైద్య విద్యను చేరువ చేయడంతో పాటు మెడికల్ కాలేజీ ఆస్పత్రులతో అత్యాధునిక వైద్యం చేరువ చేశారు. బడ్జెట్‌తో సంబంధం లేకుండా మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పం సీఎం జగన్‌ది.. అందుకే ఆయన యజ్ఞం ఫలించింది. ► ఉమ్మడి విజయనగరం జిల్లా జనాభా 20 లక్షలకు పైనే.. అయితే జిల్లాలో ఒక్క ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి లేదు. మెరుగైన వైద్యం అవసరమైతే విశాఖపట్నం వెళ్లాల్సిందే. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాకు ఒక వైద్య కళాశాల మంజూరు చేయాలని అసెంబ్లీ వేదికగా అడిగితే.. రాష్ట్ర ఆరి్థక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు.. ప్రైవేట్ వైద్య కళాశాలకు అనుమతి ఇస్తున్నామని అప్పటి వైద్య శాఖ మంత్రి కామినేని సమాధానమిచ్చారు. ►ప్రతి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం విజయనగరంలో రూ.500 కోట్లతో కొత్త వైద్య కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జిల్లా ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి.. 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభించారు. ఇప్పుడు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా అక్కడ వైద్య సేవలందుతున్నాయి. ► జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల.. ఇంతవరకూ ఏ ప్రభుత్వం చేయని సాహసం.. ఏజెన్సీ అయినా, వెనుకబడిన ప్రాంతమైనా.. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, ఖరీదైన వైద్యం ఉచితంగా అందాలనే సంకల్పంతో ఖర్చు ఎంతయినా వెనకాడకుండా.. వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం ప్రారంభించారు. 2023–24 విద్యా సంవత్సరంలో ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించగా.. 2024–25లో 5, 2025–26లో 7 వైద్య కళాశాలలు ప్రారంభించనున్నారు. కొత్తగా 17 మెడికల్ కళాశాలలు స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11. సీఎం జగన్ పాలన వచ్చాక ఏకంగా 17 కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. రూ.8,480 కోట్లతో వీటి నిర్మాణం ప్రారంభించారు. రాష్ట్రంలో ఒకే ఏడాది 5 వైద్య కళాశాలలను ప్రారంభించి సీఎం జగన్ కొత్త రికార్డు సృష్టించారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. 1923లో రాష్ట్రంలో మొదటిగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి.సీఎం జగన్ మాత్రం కేవలం ఐదేళ్లలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రజల మనసుల్లో నిలిచిపోయారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తారు. ఇప్పటికే ఈ ఐదు వైద్య కళాశాలల ఏర్పాటు కోసం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ)కి దరఖాస్తు చేశారు. త్వరలో తనిఖీలు చేస్తారు. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించేందుకు వీలుగా చర్యలు మొదలు పెట్టారు.కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్య విద్య చదివేందుకు అవకాశం కల్పించడమే కాకుండా.. పరిసర ప్రాంతాల్లోని పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువవుతాయి. కొత్తగా ప్రారంభించే కళాశాలల్లో ఎంబీబీఎస్ బ్యాచ్ పూర్తయ్యి బయటకు వచ్చే సమయానికి 600 పడకల సామర్థ్యంతో ఆస్పత్రులు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. కొత్త బోధనాస్పత్రుల్లో కిడ్నీ, న్యూరో, కార్డియాలజీ, క్యాన్సర్ లాంటి సూపర్ స్పెషాలిటీ విభాగాల్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. రేడియాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ విభాగాల ఏర్పాటుతో వివిధ వ్యాధుల నిర్ధారణ సులభతరమవుతుంది.సూపర్‌హిట్.. ఫ్యామిలీ డాక్టర్ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు చేరువ చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులకు తమ పరిధిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ బాధ్యతలను అప్పగించారు. రోజు మార్చి రోజు తమకు కేటాయించిన విలేజ్ క్లినిక్‌లకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నారు. 104 వాహనంతో పాటు వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఓపీ సేవలు, అనంతరం కదల్లేని స్థితిలో మంచానికే పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, ఆరోగ్యశ్రీ రోగుల ఇళ్లకు వెళ్లి ఇంటి వద్దే వైద్యం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి చిన్నారులు, విద్యార్థుల ఆరోగ్యం వాకబు చేస్తున్నారు. టెలిమెడిసిన్ కన్సల్టేషన్ ఇక్కడ అందుబాటులో ఉంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలులో విలేజ్ క్లినిక్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 3.83 కోట్ల వైద్య సేవలు ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్‌రన్ 2022 అక్టోబర్ 21న ప్రారంభించారు. పూర్తి స్థాయిలో గత ఏడాది ఏప్రిల్‌లో అందుబాటులోకి వచ్చింది.ఇంతవరకూ పీహెచ్సీ వైద్యులు 10,032 విలేజ్ క్లినిక్స్‌ను సందర్శించి 3,83,19,985 మందికి వైద్య సేవలు అందించారు. ‘ఫ్యామిలీ డాక్టర్’లో అందే వైద్య సేవలు ► జనరల్ అవుట్ పేషెంట్ సేవలు ► బీపీ, సుగర్, ఊబకాయం వంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్ ► గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు ► చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు ► రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు ► ఆరోగ్యశ్రీలో శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం ► పాలియేటివ్ కేర్ 4 తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ ► 2,500 జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను నెలకొల్పారు. ఫ్యామిలీ డాక్టర్లో సేవలు విభాగం వైద్య సేవలుజనరల్ ఓపీ 1,01,36,801 గర్భిణులు 28,76,014 బాలింతలు 8,81,412 రక్తహీనత 1,63,368 బీపీ 95,32,752 సుగర్ 57,23,906 బీపీ, సుగర్ 87,03,543 గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు ► గర్భ నిర్ధారణకు యూరిన్ టెస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ సుగర్ పరీక్ష ► మలేరియా పరీక్ష హెచ్ఐవీ నిర్ధారణ డెంగ్యూ టెస్ట్ మల్టీపారా యూరిన్► స్ట్రిప్స్ (డిప్ స్టిక్) అయోడిన్ టెస్ట్ వాటర్ టెస్టింగ్ హెపటైటిస్ బీ నిర్ధారణ ► ఫైలేరియాసిస్ టెస్ట్ సిఫిలిస్ ర్యాపిడ్ టెస్ట్ విజువల్ ఇన్స్పెక్షన్ స్పుటమ్ (ఏఎఫ్‌బీ) పార్వతీపురం మన్యం జిల్లాలోని బొబ్బిలి సామాజిక కేంద్రం(సీహెచ్‌సీ) చుట్టుపక్కల ఆరు మండలాల రోగులకు ఆధారం. గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ముగ్గురు లేదా నలుగురు వైద్యులు మాత్రమే పనిచేసేవారు. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆసుపత్రిని అభివృద్ధి చేశారు. ఓపీ బ్లాక్ పాత భవనాన్ని కూల్చి రూ.3.36 కోట్లతో నూతన భవనం నిర్మించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా నిర్మించారు. ఓపీ, ల్యాబ్, సర్జికల్, లేబర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. పడకల సామర్థ్యం 50కు పెంచి తొమ్మిది మంది వైద్యులను సమకూర్చారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం ఏరియా ఆస్పత్రిని గత టీడీపీ ప్రభుత్వంలో 50 పడకల నుంచి 100 పడకలకు పెంచుతామని హామీలిచ్చి గాలికి వదిలేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 100 పడకలకు ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేశారు. రూ.13 కోట్లతో నాడు–నేడులో మాతా శిశు సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఉండే 100 పడకలకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా అవుతుంది. 2022లో ఈ విభాగాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్లతో అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా వార్డులు, ఆపరేషన్ థియేటర్లు, లేబర్ రూమ్, ఇతర వసతులను సమకూర్చారు.మానవ వనరుల కొరతకు చెక్ 2019 నుంచి ఇప్పటి వరకు వైద్యశాఖలో 54 వేల పోస్టులను భర్తీ చేశారు. బాబు హయాంలో కేవలం 4,469 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. నేడు ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులు సహా 14 మంది సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీవ్రంగా ఉండగా.. ఏపీలో 94.6 శాతం స్పెషలిస్ట్ వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉన్నారు.రూ.వేల కోట్లతో అత్యాధునిక పరికరాలు 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్‌లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్ అమలుకోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. రూ.1685.95 కోట్లతో ఆస్పత్రులకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలు సరఫరా చేశారు. విలేజ్ క్లినిక్స్, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలకు రూ.218.16 కోట్లతో మెడికల్ పరికరాలు అందించారు.పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించడానికి రూ.131.27 కోట్లతో పరికరాలు సమకూర్చారు. కేజీహెచ్, కర్నూలు, కాకినాడ జీజీహెచ్‌లకు రూ.46.11 కోట్లతో సీటీ, ఎంఆర్ఐ, క్యాథ్‌ల్యాబ్ సేవలను ప్రారంభించారు. క్యాన్సర్ వైద్యాన్ని బలోపేతం చేస్తూ రూ.190 కోట్లతో కేజీహెచ్, కర్నూలు, కడప ఆస్పత్రులకు అత్యాధునిక వైద్య పరికరాలు అందిస్తున్నారు. రూ.193.50 కోట్లతో ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ఐసీయూల అభివృద్ధి చేపట్టారు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల మేరకు మందులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఆస్పత్రుల్లో 608 రకాల మందులు అందుబాటులో ఉంచుతున్నారు. టీడీపీ హయాంలో 2014–19 మధ్య మందుల కోసం సుమారు రూ. 868 కోట్లు ఖర్చు చేశారు. ఏడాదికి సుమారు రూ.216 కోట్లు మాత్రమే వెచ్చించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2019 నుంచి మందుల కోసం రూ. 2,090.39 కోట్లు ఖర్చు చేశారు. అంటే ఏడాదికి రూ. 418.07 కోట్ల వ్యయం ఆరోగ్య సురక్షలో 6.45 కోట్ల వైద్య పరీక్షలు అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. గ్రామాల్లోని జగనన్న సురక్ష శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు ఇస్తున్నారు. ఆస్పత్రుల్లో వైద్యం అవసరం ఉన్న వారికి ఆరోగ్యశ్రీలో ఉచితంగా చికిత్సలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ కార్యక్రమం ప్రవేశపెట్టగా తొలి దశలో 60,27,843 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలు సందర్శించి స్క్రీనింగ్ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచితంగా చికిత్సలు అందించారు. ఆస్పత్రులకు వెళ్లి సేవలు పొందేలా ప్రయాణ ఖర్చుల కోసం రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. ఈ ఏడాది జనవరిలో రెండో దశ సురక్షను ప్రారంభించగా.. ఇంతవరకూ 10,881 శిబిరాలు నిర్వహించారు. రూ.16,880 కోట్లతో నాడు–నేడుతానిచ్చిన హామీని నెరవేరుస్తూ సీఎం జగన్ నాడు–నేడులో ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. అధ్వానంగా ఉన్న ఆస్పత్రులను ఐదేళ్లలో చక్కదిద్దారు. భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం ఏకంగా రూ.16,880 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. 640 ఆస్పత్రులకు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ (ఎన్‌క్వా‹Ù), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలుస్తోంది. కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. జగనన్న ఆరోగ్య సురక్ష –1లో సేవలు నిర్వహించిన శిబిరాలు – 12,423మొత్తం ఓపీలు – 60,27,843నిర్వహించిన వైద్య పరీక్షలు– 6,45,06,018మెరుగైన వైద్యం కోసం సిఫార్సు– 1,66,828జనరల్ సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 86,053కేటరాక్ట్ సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 80,115కంటి స్క్రీనింగ్– 9,52,066 (5.73 లక్షల మందికి అద్దాలు పంపిణీ)కొత్తగా గుర్తించిన బీపీ కేసులు– 2,51,529కొత్తగా గుర్తించిన సుగర్ కేసులు– 1,54,248జగనన్న ఆరోగ్య సురక్ష –2లో సేవలు నిర్వహించిన సురక్ష శిబిరాలు– 10,881 ఓపీలు– 38,58,410 నిర్వహించిన పరీక్షలు– 88,83,316 మెరుగైన వైద్యానికి సిఫార్సు– 17,558 సిఫార్సులో పూర్తయిన చికిత్సలు– 8,699 కళ్లద్దాలు అవసరమని గుర్తింపు– 2,09,319 అద్దాలు పంపిణీ– 1,70,594 -
కూటమికి బీఎస్పీ పోటు!
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరాదిలో బీజేపీ కోటను బద్దలు కొట్టాలన్న విపక్ష ఇండియా కూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లేలా కని్పస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలఓల బీజేపీని నిలువరించేందుకు ఓట్ల సమీకరణకు కాంగ్రెస్ కిందా మీదా పడుతోంది. ఆ ప్రయత్నాలను వమ్ము చేసేలా బీఎస్పీ వ్యవహరిస్తోంది.ముఖ్యంగా యూపీలో ముస్లిం ఓట్ల సమీకరణతో బీజేపీ స్థానాలకు భారీగా గండి కొట్టాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. కానీ ముస్లిం ఓట్లను నిలువునా చీల్చేలా రాష్ట్రంలో బీఎస్పీ ముస్లింలకు ఎక్కువ టికెట్లిచ్చింది! అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ప్రాభవం కోల్పోయిన బీస్పీ లోక్‌సభ ఎన్నికల్లోనైనా ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇండియా కూటమికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. యూపీలో కూటమికి దెబ్బే! అత్యంత కీలకమైన యూపీలో 80 స్థానాలకు గానూ బీజేపీ ఈసారి సొంతంగానే 70 సీట్లపై గురిపెట్టింది. పొత్తులో భాగంగా కట్టిన కాంగ్రెస్ 13, ఎస్పీ 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. యూపీలో 21 శాతమున్న యాదవ ఓట్లకు 19 శాతం ముస్లిం ఓట్లు కలిస్తే భారీగా ఓట్లు రాలుతాయని ఆశ పడుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 18 జిల్లాల పరిధిలోని పలు లోక్‌సభ స్థానాల్లో ముస్లింలు నిర్ణాయక శక్తిగా ఉన్నారు. వీటిలో పలు జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 30 శాతం పైగా ఉంది. వీరంతా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సంప్రదాయ ఓటు బ్యాంకే.దాంతో ముస్లింల ఓట్లను సంఘటితంగా తమవైపు సమీకరించుకునేందుకు కాంగ్రెస్, ఎస్పీ వారికి 11 సీట్లు కేటాయించాయి. మాయా నిర్ణయాలు వాటి ప్రయత్నాలకు గండి కొట్టేలా ఉన్నాయి. బీఎస్పీ ఈసారి ఏకంగా 18 స్థానాల్లో ముస్లింలకే టికెట్లిచ్చింది! దాంతో ముస్లిం ఓట్లకు గండిపడి ఎస్పీ/కాంగ్రెస్ అభ్యర్థుల అవకాశాలకు గండిపడేలా కని్పస్తోంది. ఇక దళిత ప్రాబల్య పశ్చిమ యూపీలో వాటి ఓట్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్/ఎస్పీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే అక్కడా బీఎస్పీ ప్రచారాన్ని ఉధృతం చేసి కాంగ్రెస్‌పై ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఇది వాటికి మరో తలనొప్పిగా మారింది. రాజస్థాన్‌లోనూ బీఎస్పీ ఆరుచోట్ల ముస్లింలకు టికెటిచ్చింది! మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోనూ ఇదే పరిస్థితి! లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీఎస్పీ ప్రదర్శన ఎన్నికలు సీట్లు ఓట్ల శాతం 2004 19 5.33 2009 21 6.17 2014 0 4.19 2019 10 3.67 ప్రభావం తగ్గలేదు బహుజన నేత కాన్షీరాం వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్రంలో 21 శాతమున్న ఎస్సీల్లో సగానికి పైగా జాతవ్లే. ఆ కులం నుంచి వచ్చిన మాయావతికి వారిపై పట్టు ఉంది. కానీ 2017, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీలు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గడంతో మాయా ప్రభను కోల్పోయారు. 2017లో బీఎస్పీకి 19 సీట్లు రాగా 2022లో ఒక్కటంటే ఒక్క సీటే వచ్చింది! కాకపోతే ఆ ఎన్నికల్లో బీఎస్పీ 12.88 శాతం ఓట్లు సాధించింది.ఇక 2004 లోక్‌సభ ఎన్నికల్లో 19, 2009లో 21 సీట్లు సాధించిన బీఎస్పీ, 2014లో మాత్రం ఖాతాయే తెరవలేకపోయింది. 2019లో ఎస్పీ, రాష్ట్రయ లోక్‌దళ్‌తో పొత్తుల వల్ల 10 సీట్లు గెలుచుకుంది. కానీ వారిలో ఐదుగురు ఎంపీలు పార్టీని వీడారు. ఈ ఎన్నికల్లో మాయవతి ఒంటరిగా పోరాడుతున్నారు. యూపీలో 80 స్థానాలకు గానూ 64 చోట్ల అభ్యర్థులను నిలిపారు. అలాగే రాజస్థాన్‌లో 25, మధ్యప్రదేశ్‌లో 7, ఛత్తీస్‌గఢ్‌లో 8 స్థానాల్లోనూ బీఎస్పీ పోటీ చేస్తోంది. ఈసారి కూడా ముస్లిం దళిత ఫార్ములాతోనే ఆమె బరిలో దిగారు. ఆమె ప్రచార సభలకు జనం భారీగా వస్తున్నారు. దాంతో మాయా దెబ్బకు మోదీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని కాంగ్రెస్ తదితర విపక్షాలు భయపడుతున్నాయి.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్‌లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్‌గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్‌లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement