విశేష సేవలకూ ఇక అడ్వాన్స్ బుకింగ్ | Advance booking for visit of Tirumala | Sakshi
Sakshi News home page

విశేష సేవలకూ ఇక అడ్వాన్స్ బుకింగ్

May 15 2015 4:04 AM | Updated on Sep 3 2017 2:02 AM

అరుదైన ఆర్జిత సేవల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని సామాన్య భక్తులకూ కల్పించనున్నట్టు టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు.

లక్కీడిప్ ద్వారా కేటాయింపు
జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు
ఎల్లుండి సేవా టికెట్ల కోసం రేపటి నుంచి బుకింగ్  

 
 సాక్షి, తిరుమల: అరుదైన ఆర్జిత సేవల్లో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని సామాన్య భక్తులకూ కల్పించనున్నట్టు టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఇందులో భాగంగా లక్కీడిప్ (లాటరీ) పద్ధతి అమలు చేస్తామని ఆయన గురువారం విలేకరులకు వివరించారు. ఈనెల 17వ తేదీన జరిగే సేవలకోసం 16వ తేదీ నుంచి బుకింగ్ ప్రారంభిస్తామన్నారు.
 
 గతంలో టీటీడీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రకారం కొందరు బల్క్ బుకింగ్ (అధికమొత్తం)లో పొందిన తోమాల, అర్చన, అభిషేకం, మేల్‌ఛాట్ వస్త్రం వంటి అరుదైన సేవా టికెట్లలో కొన్నింటిని రద్దు చేశామని, ఆ టికెట్లను కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతి ద్వారా సామాన్య భక్తులకు కేటాయిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement