అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని బదిలీ | Additional District Judge Priyadarshini transfer | Sakshi
Sakshi News home page

అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని బదిలీ

Nov 25 2014 1:35 AM | Updated on Sep 2 2017 5:03 PM

అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని బదిలీ

అదనపు జిల్లా జడ్జి ప్రియదర్శిని బదిలీ

ఒకటవ అదనపు జిల్లా జడ్జి ఎం. జి.ప్రియదర్శినికి బదిలీ అయ్యింది. ఆమెను కర్నూలు జిల్లా నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు

 విజయనగరం లీగల్ :  ఒకటవ అదనపు జిల్లా జడ్జి ఎం. జి.ప్రియదర్శినికి బదిలీ అయ్యింది. ఆమెను కర్నూలు జిల్లా నంద్యాల మూడో అదనపు జిల్లా జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కోర్టు బాధ్యతలను జిల్లా జడ్జి ఎం.లక్ష్మీనారాయణకు అప్పగించారు.  2012 ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించిన ఆమె..కేసుల సత్వర పరిష్కారానికి కృషిచేశారు.   న్యాయ అవగాహన సదస్సులో చట్టాలు,కోర్టులపై ప్రజల్లో అవగాహన కల్పనకు కృషి చేశారు.  నాలుగు గోడలకే పరిమితం కాకుండా  పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.   ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్  కార్యక్రమంలో పాల్గొన్నారు.  పచ్చదనం పరిశుభ్రత పేరుతో కోర్టులను శుభ్రపరిచారు. మానవహక్కుల రక్షణ చట్టం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా, బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (నిర్భయ) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement